తెలంగాణ

పెట్రోల్ ధరల తగ్గింపుపై కేంద్రం రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మే 31: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను 83 రూపాయలకు పైగా పెంచి.. కేవలం ఒక్క పైసా మాత్రమే తగ్గించి రాజకీయం చేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంత్‌రావు అన్నారు. పెట్రోల్ ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని మోదీ సర్కార్ 60 పైసలు తగ్గిద్దామనుకున్నామని, కానీ ఒక్క పైసా మాత్రమే తగ్గించామని చెప్పటం శోచనీయమన్నారు. పెట్రోల్ ధరలు తగ్గింపుపై మోదీ సర్కార్ రాజకీయం చేయటం శోచనీయమని విమర్శించారు. నరేంద్రమోదీ పాలనలో పెట్రోల్ 110 రూ, డీజిల్ 100 రూపాయలకు చేరుకుంటుందని జోస్యం చెప్పారు. గురువారం సిద్దిపేట జిల్లా పొన్నాల వద్ద ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ పాలన పరంగా అన్ని రంగాల్లో విఫలమైనారన్నారు. ప్రజలు మోదీ సర్కార్‌కు గుణపాఠం చెప్పేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. 2019లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పెద్ద భూస్వాములకు వరంగా మారిందన్నారు. కేసీఆర్ దొరల పాలనకు సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 3500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని.. ముఖ్యమంత్రి, మంత్రులు కానీ ఏ ఒక్కరూ కనీసం పరామర్శించలేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరికి పరిహారాన్ని అందచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అత్యధిక మంది కౌలురైతులున్నారని, వారందరికీ పరిహారంతో పాటు రైతుబంధు పథకాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా నేరేళ్ల ఘటన జరిగి ఏడాది పూర్తి కావస్తుందన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఒక వ్యక్తికి ఆరు లక్షల పరిహారం కేటాయించి చేతులు దులుపుకున్నారన్నారు. నేరేళ్ల ఘటనపై ఇంతవరకు కనీసం చార్జ్‌షీట్ వేయకపోవటం విచారకరమన్నారు. నేరేళ్ల ఘటనపై కేసులను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో రైతుల గిట్టుబాటు ధర కోసం పెద్దఎత్తున ఆందోళన చేశారని, తాను సైతం ఆందోళనలో పాల్గొన్నట్లు తెలిపారు. రైతులపై కేసులు నమోదు చేయటంతో పాటు, రైతులకు సంకెళ్లు వేసి సర్కార్‌గా టీఆర్‌ఎస్ చరిత్ర కెక్కిందన్నారు. ఇప్పుడు రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అందరికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నేరేళ్ల, ఖమ్మం ఘటనలో రైతలపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్సీసెల్ కన్వీనర్ బొమ్మల యాదగిరి, రాష్ట్ర నాయకులు దాస అంజయ్య, డీసీసీ మైనార్టీసెల్ అధ్యక్షుడు కలీమోద్దీన్, నాయకులు అక్బర్, కొలను నరేష్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏఐసీసీ కార్యదర్శి హనుమంతరావు