తెలంగాణ

స్వయం సహాయక బృందాలకు వడ్డీ బకాయిలను వెంటనే చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం వడ్డీ బకాయిలను వెంటనే చెల్లించాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మహిళా సాధికారతకు చిహ్నంగా స్వయం సహాయ మహిళా గ్రూపులను చూపుతున్నప్పటికీ, ఆచరణలో వీరికి ప్రభుత్వం మొండి చేయి చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడ్డ మహిళ సంఘాలకు ఇస్తున్న రుణాలపై వడ్డీని ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా 2015 అక్టోబర్ నుంచి నిలిపివేసిందన్నారు. వడ్డీ బకాయిలు చెల్లించక పోవడంతో బ్యాంకులు చాలా సంఘాలకు రుణాలు ఇవ్వకుండా ఆపివేసాయని చెప్పారు. ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల మహిళా సంఘాలు స్వయం ఉపాధి కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు లింకేజి రుణాలను ఎత్తివేసే కుట్రలో భాగంగా ప్రభుత్వం ఈ తరహా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి మహిళా గ్రూప్‌ల పట్ల, వారి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే బ్యాంకులకు పడ్డ బకాయిలను చెల్లించి, తిరిగి రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.