తెలంగాణ

దేశంలో నెంబర్ వన్ సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 31: అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోని 29 రాష్ట్రాలలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నెంబర్ వన్‌గా నిలిచారని రాష్ట్ర కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. కార్మిక మహోత్సవ ముగింపు సభ వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాలుగు సంవత్సరాల్లోనే 426 అభివృద్ధి సక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంతో గ్రామ, గ్రామాన అన్నాదాతలు అబ్బుర పడుతున్నారని, రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పెట్టుబడి సాయం పథకం అత్యంత సాహసోపేత నిర్ణయమని అన్నారు. గత ప్రభుత్వాల కాలంలో అన్నదాతలు కరెంట్ కోతలతో, ఎరువుల కొరతతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని, ఎరువులు, విత్తనాల కోసం గంటలు, రోజుల తరబడి క్యూలో నిలబడేవారని, అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సమస్య లేకుండా చేసిన ముఖ్యమంత్రి రైతు బాంధవుడని అన్నారు. జూన్ 2 నుండి కొత్తగా పాస్ బుక్‌లు తీసుకున్న ప్రతి రైతుకు 5లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నామని అన్నారు. అందుకోసం ప్రతి రైతు పేరున రెండు లక్షల ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. తెలంగాణలో పోలీసుల సేవలు భేష్ అని కితాబిచ్చారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా మత ఘర్షణలు, హింసాత్మకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు లేవన్నారు. తాము కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ పోలీసింగ్ సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. పోలీసుశాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాలనే 350 కోట్లు వెచ్చించి నూతన వాహనాలు కొలుగోలు చేసామని తెలిపారు. రైతుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును భారత ప్రభుత్వం మెచ్చుకుందని అన్నారు. విద్యా అభివృద్ధికి పెద్దపీట వేస్తు 500 రెసిడెన్షియన్ పాఠశాలలు, బీసీలకు 119 గురుకుల పాఠశాలు, ఎంబీసీ కులాలకు వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించామని తెలిపారు. మరో వైపు కార్మిక రంగాన్ని విస్తృతపరచి, అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు బిల్డింగ్ కార్మికులు చనిపోయినట్లైతే వారి కుటుంబాలకు ఆరు లక్షల ప్రమాద బీమా వర్తించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రతి షాపులో పనిచేసే కార్మికుని పీఎఫ్ వర్తిస్తుందని అన్నారు. కార్మికుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. వరంగల్ జిల్లాలో కార్మికుల సంక్షేమం కోసం అనునిత్యం కృషిచేస్తున్న ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ను ఆయన అభినందించారు. ఇదిలా ఉండగా, గత కొన్ని సంవత్సరాల కాలంలో పెండింగ్‌లో ఉన్న కాజీపేట డివిజన్ ఏర్పాటుకోసం తమ ప్రభుత్వం కృషిచేస్తుందని హామీ ఇచ్చారు. తమ పార్టీ ఎంపీల సహకారంతో డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే 1500పైగా తెలంగాణ ఉద్యమ కేసులను ఎత్తివేసామని, ఇంకేమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని కూడా ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షత వహించగా రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ నరేందర్, కూడా చైర్మన్ యాదవరెడ్డి పాల్గొన్నారు.

చిత్రం.. కాజీపేటలో జరిగిన కార్మిక మాసోత్సవ ముగింపు సభలో ప్రసంగిస్తున్న హోం మంత్రి నర్సింహా రెడ్డి