తెలంగాణ

కాంగ్రెస్ నేతలకు కళ్లజోళ్ళు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు వినూత్న పథకాలతో ముందుకు వెళుతుంటే విపయ నేతలకు కన్పించడం లేదని, అందుకోసం ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకు కళ్ళజోళ్ళు పంపిణీ చేయాలని రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు కంటిచూపు పరీక్షలు ఉచితంగా చేయించడానికి నిర్ణయం తీసుకున్నారని అందుచేత కాంగ్రెస్ నేతలు కంటిచూపుతో పాటు కళ్ళజోళ్ళు తీసుకుంటే తాము చేస్తున్న అభివృద్ధిని చూడవచ్చునని ఆయన చమత్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఏర్పడక ముందు ఆంధ్రానేతలు తెలంగాణ ఉద్యమాలను నిర్వీర్యం చేయడాని కి ప్రయత్నించారని అయితే తెలంగాణ ప్రజ లు వాటిని తిరస్కరించారని ఆయన గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలో ఎవరూ చేపట్టని పథకాలు కేసీఆర్ చేపట్టి అందరికీ ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్నారని చెప్పారు. సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుతో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తోందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం కోసం ఉద్యమాల్లో పాల్గొన్న కళాకరులు చేసిన కృషిని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తూ ఆయా రంగాలకు కీర్తిప్రతిష్టలు తెచ్చిన వ్యక్తులకు సాంస్కృతిక శాఖ ఘనంగా సత్కారాలతో పాటు అవార్డులను అందచేసింది. సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బొర్రా వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణ అవతరణ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడిచాయని ఈ సందర్భంగా వివిధ రంగాల్లో అద్భుతాలు సృష్టించిన వ్యక్తులను గౌరవించి, అవార్డులు అందచేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తుల పట్ల తెలంగాణ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. పోలీసులకు ప్రజలకు మధ్య స్నేహసంబంధం ఉండాలన్న నినాదం బహుళ ప్రచారంలోకి వచ్చిందన్నారు. సాంస్కృతిక శాఖ సలహాదారుడు కెవి రమణాచారి మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణ అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి చేసిన ఏర్పాట్లపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.