తెలంగాణ

అభివృద్ధిలో అటవీ అభివృద్ధి కార్పొరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అభివృద్ధిలో దూసుకుపోతుందని కార్పొరేషన్ చైర్మన్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కార్పొరేషన్ ప్రధాన కార్యలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. 2017-18లో యూకలిప్టస్ క్లోనల్ ఫ్లాంటేషన్స్ లక్ష్యాలకు మించి వృద్ధి నమోదు చేసుకుందని తెలిపారు. మూడు లక్షల టన్నుల పల్ప్ ఉడ్‌ను పేపర్ మిల్లులకు సప్లయ్ చేసినట్టు తెలిపారు. లాంగ్ వెదురు విక్రయం ద్వారా గత ఏడాది 9.06 కోట్ల ఆదాయం ఆర్జించిందని చెప్పారు. ఎకో టూరిజం రంగంలోనూ అటవీ అభివృద్ధి సంస్థ తనదైన ముద్రను వేస్తోందని తెలిపరు. గత ఏడాది పాల పిట్ట సైక్లింగ్ ఉద్యానవనం, బర్డ్ పార్కు కొండాపూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కవాల్ టైగర్ రిజర్వు సమీపంలో మంచిర్యాల జిల్లా చింతగూడ సమీపంలో కొత్త పర్యాటవరణ పర్యాటక ప్రాజెక్టు కోసం ఆరు ఎకరాల భూమిని గోదావరి నది దగ్గర సేకరించినట్టు చెప్పారు. నల్లగొండ జిల్లా వైజాగ్ కాలనీలో నాగార్జునసాగర్ తీర ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రం లో వెదురు పరిశ్రమ ఏర్పాటుకు రూ. 22.4 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు తెలిపారు.