తెలంగాణ

అభివృద్ధిలో మేటి తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 2: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఐదో వసంతంలోకి అడుగుపెడుతున్నాం, ఈ నాలుగు సంవత్సరాలలో బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయని రాష్ట్ర ఉమ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం వరంగల్ పోలీస్ కమీషనరేట్‌లోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. ఈకార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై జాతీయ జెండా ఎగరవేసారు. అనంతరం మాట్లాడుతూ అన్ని వర్గా ప్రజల అభ్యున్నతికి దోహదపడే విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో రూపొందించిన పథకాలు నేడు దేశ, విదేశాల ప్రశంసలు పొందుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన నాలుగేళ్లు అనతి కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో అత్యంత అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీరు, ఐటి, పారిశ్రామిక వంటి రంగాల్లో తెలంగాణ అనేక రికార్డులు సాధించింది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా, ఇక్కడి కార్యక్రమాలను అధ్యయనం చేసే విధంగా ఆయా రాష్ట్రాలు మన విధానాలను , పథకాలను అనుసరించేలా మనకుంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నామని తెలిపారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ లక్ష్యంవైపు తీసుకెళ్లేందుకు వడివడిగా అడుగులేస్తున్నామని అన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలని , రైతును రాజును చేయాలని, అందరి ముఖాల్లో చిరునవ్వులు చూడాలనేదే ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు. రాష్ట్రం నుండి పేదరికాన్ని పారదోలాలని, చేతి వృత్తులు, కులవృత్తులకు జీవం పోయాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి నేడు సాకారమే కళ్లముందే సాక్షాత్కరిస్తుందని తెలిపారు. వచ్చిన తెలంగాణ నలుగురి ముందు నవ్వుల పాలు కాకూడదని, తల ఎత్తుకుని నిలబడేలా ఉండాలని సీఎం కేసీఆర్ ఈ నాలుగేళ్లగా చేసిన శ్రమ ఫలితమే నేడు ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సగర్వంగా, సంతోషంగా మనమంతా పండుగ వాతావరణంలో జరుపుకుంటన్నామని అన్నారు.గ్రామాలు స్వయం సమృద్ధితో వికసించాలని, వ్యవసాయం పండుగగా మారాలని, రైతును రాజు చేయాలనే ముఖ్యమంత్రి తపిస్తున్నాడని అన్నారు. సీఎం చేసిన కృషి నేడు రైతు ముఖాల్లో సంతోషాన్ని నింపుతోంది. వ్యవసాయానికి వైభవాన్ని తీసుకొస్తుందని అన్నారు. వ్యవసాయం దండగ అన్న పరిస్ధితిని పూర్తిగా మార్చి వ్యవసాయం పండగలా చేసే ప్రయత్నం నిర్విరామంగా, నిర్విగ్నంగా కొనసాగుతోందిని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టగానే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు ఉన్న పంట రుణాలను 17వేల కోట్ల రుణాలను నాలుగు దశలలో మాఫి చేసి 35లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశారు. విత్తనాలు, ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టి క్యూలో నిలబడే పరిస్ధితిని పూర్తిగా మార్చేసి నేడు ఎప్పుడు వెళ్లిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా స్టాక్ చేశామని అన్నారు. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క రైతు ఏ ఒక్క గ్రామంలోగానీ, మండలంలోగానీ ఎరువుల, విత్తనాల కోసం లైన్లో నివబడ్డ వార్త కూడా వినకుండా చేశారని గుర్తుచేశారు. అదే విధంగా భూమి రికార్డుల జోలికి వెళ్లడం అంటేనే వెన్నులో వణుకు పుట్టించే కార్యక్రమం గత 60 ఏళ్లుగా ఎవరూ సాహసించని కార్యక్రమం అయినా సరే రైతు నిత్యం భూ రికార్డులు సరిగా లేక ప్రభుత్వ కార్యాలయాల వెంట తిరిగే దుస్ధితి ఇక ఉండొద్దని ఆలోచించిన సీఎం కేసీఆర్ వంద రోజులలో భూరికార్డులను ప్రక్షాళన చేయించారన్నారు. అదే విధంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్న వారికి సాగు, త్రాగు నీటి అందిస్తున్నామని అన్నారు. రైతులు రెండు పంటలు పండించే విధంగా ప్రతి చెరువును నింపడానికి మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టి చెరువులలో మట్టి తీయిస్తు, కట్టలను అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. అంతే కాకుండా ప్రతి చెరువును గోదావరి నీటితో నింపే విధంగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లాలోని హైదరాబాద్-వరంగల్ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఈకార్యక్రమంలో అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, జెడ్పీ ఛైర్‌పర్సన్ పద్మ, ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కొండ మురళి, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్,కొండా సురేఖ, ఆరూరి రమేష్, సీపీ రవీందర్, మున్సిపల్ కమీషనర్ వీపీ గౌతమ్, మేయర్ నరేందర్, కూడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. జాతీయ జెండా ఆవిష్కరించి వందన సమర్పణ చేస్తున్న డిప్యూటీ సీఎం, తదితరులు