తెలంగాణ

వైద్యారోగ్య శాఖలో బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ వైద్యఆరోగ్య శాఖలో సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నాడు సంబంధిం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ధేశిత ప్రాంతంలో ఎక్కువ రోజులు పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. బదిలీలను కోరుకున్న ఉద్యోగులు ఎక్కడ ఖాళీగా ఉందో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుందని సూచించింది. వైద్యశాఖలో జోనల్, మల్టీజోన్, స్టేట్ కేడర్‌లో ఉన్న అన్ని కేటగిరిల్లో బదిలీకి అర్హులైన ఉద్యోగులు తమ సమాచారాన్ని ఉన్నతాదికారులకు నివేధించాలి. ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు బదిలీకి సంబంధించిన సమాచారం అందివ్వాలి. 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఉంటుంది. 14, 15వ తేదీల్లో ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. బదిలీలకు సంబంధించిన సమాచారం వైద్యఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపింది.