తెలంగాణ

అల్లోపతి వైద్యానికి దీటుగా భారతీయ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: తెలంగాణలో అల్లోపతికి దీటుగా ఆయుష్ (్భరతీయ వైద్యం) ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఆయుష్ శాఖపై సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి చర్చించారు. ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఆయుష్ ఆసుపత్రులకు కొత్త భవనాలు నిర్మించాలని, భవనాలు ఉన్నచోట 20 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎయిడ్స్‌పై భారతీయ వైద్యంలో పరిశోధనలు జరగాల్సి ఉందని, తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశంపై శ్రద్ద తీసుకుని, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భారతీయ వైద్యం పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ప్రభుత్వం కాపాడుతుందని తెలిపారు.