తెలంగాణ

నేడు విద్యుత్ ఉద్యోగుల బదిలీల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జాబితాను సోమవారం నాడు ఆయా కార్యాలయాల్లో వెల్లడించనున్నారు. 25- 35 నిష్పత్తితో ఉద్యోగులను బదిలీ చేయడానికి సంస్థ ప్రణాళికను రూపొందిచింనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బదిలీల సమాచారం తెలియడంతో ఉద్యోగుల్లో సందడితో పాటు ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ నెల 11న అభ్యంతరాలు, అభ్యర్థనలు ఉంటాయి, అలాగే 18న బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయి. 25న ఉద్యోగులు తమకు నిర్ధేశించిన చోటుకు వెళ్ళాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉత్తర్వులు అందుకున్న ఉద్యోగులు ఏడు రోజుల్లో నిర్ధేశించిన ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. బదిలీల వ్యవహారంపై సోమవారం తమ యూనియన్ నేతలు సీఎండీ రఘుమారెడ్డిని కలుస్తున్నట్లు 1104 కార్మిక నేత సాయిబాబా తెలిపారు.