తెలంగాణ

మోదీ ఏజెంట్ సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేట టౌన్, జూన్ 11: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోదీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ జాతీయ నాయకులు సూదిని జైపాల్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో జరిగిన కాంగ్రెస్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నా సీఎం కేసీఆర్ కించిత్తుమాట్లాడకపోవడం, ప్రధాని నరేంద్రమోదీ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఆయన ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ గారడీ మాటలు నేర్చుకున్నాడని, ఆ మాటలతోనే కాలం వెళ్లదీస్తూ తాను మాటల మనిషినని ఆయనే నిరూపించుకున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. నాలుగేళ్లపాటు రైతుల నడ్డివిరగ్గొట్టి నిద్రపోయాడని అన్నారు. ఇప్పుడు రైతుబంధు పేరుతో హడావిడి చేస్తున్నాడని, ఓట్ల కోసమే ఈ నాటకమన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ పాలనలోనే కరెంటు సమస్యను పరిష్కరించామన్నారు. రైతులెవరూ కూడా 24 గంటల కరెంటును కోరడంలేదని, తొమ్మిది గంటలు నిరంతురాయంగా కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారిని మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా నేడు సీఎం కేసీఆర్ పక్కన కూర్చొబెట్టుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ రంగాలలో విఫలమై ప్రజా విశ్వాసం కోల్పోయాయని, ప్రస్తుతం దేశ ప్రజల చూపు కాంగ్రెస్ వైపే ఉందని, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి, నారాయణపేట నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి వామన్‌గారి కృష్ణ, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెడ్డిగారి రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం....నారాయణపేటలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి