తెలంగాణ

బీసీ రిజర్వేషన్లు 50శాతానికి పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: త్వరలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34శాతం నుంచి 54 శాతానికి పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ముఖ్యమంత్రిని కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆదివారం ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన 12,757 గ్రామపంచాయతిల్లో నిర్వహించిన బీసీ ఓటర్ల జనాబా లెక్కల్లో బీసీ జనాబా 54.6శాతం ఉందని తేలిందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న 34శాతం రిజర్వేషన్లను 54శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేసింది. 70 ఏళ్లుగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఇక అన్యాయం చేయతలపెడితే సహించేది లేదన్నారు. రిజర్వేషన్ల అంశం వచ్చిన ప్రతీసారి సుప్రీం కోర్టు 50శాతం రిజర్వేషన్లు మించవద్దని తీర్పునిచ్చిందని దీనికి అనుగుణంగా 22శాతానికి రిజర్వేషన్లను తగ్గించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. సుప్రీం తీర్పుపై 2013లో అప్పిలుకు వెళ్లగా స్టే వచ్చిందని ఇందులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవని స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రభుత్వం కూడా ఎలాంటి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొని బీసీలకు న్యాయం చేయాలని కోరారు. ఇందుకు కోసం ప్రత్యేక ఆర్డినెన్సును జారీ చేయాలని కోరారు.