తెలంగాణ

బ్రాహ్మణులకు న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకునేందుకు తెలంగాణ బ్రాహ్మణ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటైంది. హైదరాబాద్ (కర్మన్‌ఘాట్) లోని లక్ష్మీ కనె్వన్షన్ హాల్‌లో ఆదివారం సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగింది. ప్రముఖ న్యాయవాది రమాశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణలోని వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రమాశంకర్ మాట్లాడుతూ, సమస్యలను పరిష్కరించుకునేందుకు పోరాటం చేసేందుకు రాష్టస్థ్రాయిలో ఒక జేఏసీ అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ (టీఎస్‌బీపీ) ద్వారా బ్రాహ్మణులకు సహాయం, సహకారం అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. టీఎస్‌బీపీ ఏర్పాటు మంచి లక్ష్యంతో జరిగినప్పటికీ, వేర్వేరు కారణాల వల్ల ఈ కార్పోరేషన్ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు అమల్లోకి రాలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు బాగా తెలుసునని, అందుకే ఇప్పటి వరకు ఈ పరిషత్‌కు కేటాయించిన 200 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కోరారు. పరిషత్ రూపొందించిన పథకాలు, కార్యక్రమాలు యథావిధిగా అమలు చేయడం వల్ల పేద బ్రాహ్మణులకు లాభం చేకూరుతుందని వివరించారు. వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కె. ప్రదీప్, ఎం. రాజేశ్వరశర్మ, సి. మంగపతిరావు, గీతామూర్తి, సంధ్యారాణి, బాలసుబ్రహ్మణ్యం, రాజమోహన్‌రావు, సీతాపతిశర్మ, మోహన్‌రావు, దీపక్‌బాబు తదితరులు మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం కూడా బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాటుపడలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎస్‌బీపీని ఏర్పాటు చేశారని, అయితే ఈ పరిషత్ రూపొందించిన పథకాల్లో 14 పథకాలను ప్రభుత్వం రద్దు చేసినట్టు ప్రచారం జరుగుతోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో బ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టీఎస్‌బీపీని బలోపేతం చేయాలని, నిధులను పూర్తిగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ బ్రాహ్మణ సంఘాల జేఏసీ బ్రాహ్మణుల సమస్యలను ప్రధాన అజండాగా రూపొందించుకుని పనిచేస్తుందని ప్రకటించారు. త్వరలోనే మరో పర్యాయం సమావేశమై వివిధ అంశాలపై చరించాలని నిర్ణయించారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న టీఎస్‌బీపీ జేఏసీ నాయకుడు రమాశంకర్