తెలంగాణ

దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలతో ఆయన నాయకత్వం దేశానికి అవసరమని 29 రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి, విక్టోరియా స్టేట్ ఇన్‌చార్జి సాయిరామ్ ఉప్పు అధ్యక్షతన మెల్‌బోర్న్‌లో ఆదివారం ‘్భరతదేశ జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ అవశ్యకత’ అంశంపై సదస్సు జరిగింది. ఈ చర్చా వేదికకు ఆస్ట్రేలియాలోని 29 రాష్ట్రాల నుంచి ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించి 14 ఏళ్ల పాటు సాగించిన సుదీర్ఘ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర అవిర్భావం, అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ దిశగా చేస్తోన్న ప్రయత్నాలపై నాగేందర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసారు. కేవలం నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాల పట్ల వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులను ఆశ్చర్యచకితుల్ని చేసిందని నాగేందర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల విద్యుత్, ఇంటింటికీ మంచినీటిని అందించే మిషన్ భగీరత, చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ, భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు, రైతుబీమా పథకాలు బాగున్నాయని హాజరైన ప్రతినిధులు ప్రశంసించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి, ఆయన స్వయంగా రూపకల్పన చేసిన సంక్షేమ, అభివృద్ధ్ది పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయని వారు ప్రశంసించారన్నారు. భారతదేశ జాతీయ రాజకీయాలలో గుణాత్మక మార్పునకు కేసీఆర్ నాయకత్వంలోని ‘ఫెడరల్ ఫ్రంట్’ అవశ్యకత ఎంతైనా ఉందని ఆకాంక్షించారని నాగేందర్‌రెడ్డి తెలిపారు. సదస్సుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. వీరిలో రాజస్థాన్ ప్రతినిధి ఆశిష్ శర్మ (లోక్‌దళ్ ప్రతినిధి), న్యూఢిల్లీ ప్రతినిధి సంజిత్ భాటియా (ఆమ్ ఆద్మీ పార్టీ), హర్యానా ప్రతినిధి సత్యజిత్ గుళియా (జనహిత్ కాంగ్రెస్ పార్టీ), ఉత్తరప్రదేశ్ ప్రతినిధి అజయ్‌కుమార్ (సమాజ్‌వాదీ పార్టీ), పంజాబ్ ప్రతినిధి కుషు (శిరోమణి అకాలీదళ్), కర్నాటక ప్రతినిధి సౌమ్యకుమార్ (జనతాదల్), మహారాష్ట్ర ప్రతినిధి ఫారెల్ (బహుజన సమాజ్ పార్టీ) హాజరైనట్లు నాగేందర్‌రెడ్డి తెలిపారు.

చిత్రం..మెల్‌బోర్న్‌లో జరిగిన ఫెడరల్ ఫ్రంట్ చర్చా వేదికలో పాల్గొన్న
29 రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు