తెలంగాణ

ఏకపక్ష పాలనా వ్యవస్థ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: ఏకపక్ష పాలన వ్యవస్థ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం గనరంలో ఇక్కడ భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్ర నాయకులు చండ్ర రాజేశ్వరరావు 104వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ముఖ్య అతిధిగా రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళర్పించా రు. ఈ సందర్భంగా ‘్భరత ప్రజాస్వామ్యం - న్యాయవ్యవస్థ’ అనే అం శంపై ఆయన ప్రసంగించారు. భార త న్యాయస్థానం ఇచ్చే అతి కీలకమై న తీర్పుల్లో కేంద్రం జోక్యం సరికాద న్నారు. దేశం పేరు చెప్పి, దేశాన్ని ము క్కలు, ముక్కలుగా చేసే విచ్చినకర పాలనకు తెరలేపేందుకు వచ్చినవారిని గుర్తించడం చాలా కష్టమన్నారు. న్యాయవ్యవస్థ పాలకులకు సహకరించినంత కాలం నేరం చేసి ఉరేగడమే అవుతోందని అన్నారు. తాము చట్టబద్దమైన పాలన అందిస్తున్నామని, మహా నాయకులమని చెప్పుకునే వారు న్యాయ ప్రక్రియ ద్వారా వెలువడే తీర్పును గౌరవించాలన్నా రు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి