తెలంగాణ

విజ్ఞానంతోనే ఉన్నత శిఖరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 11: ప్రతినిత్యం విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరాలని, అందుకు టీఆర్‌ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికి వేదికగా నిలుస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నియోజకవర్గ నాయకులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ నేతలకు భద్రాచలంలో రెండురోజులు నిర్వహించిన శిక్షణ శిబిరంలో సోమవారం వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వాటిని నెరవేర్చే బాధ్యతను మనకే అప్పగించారన్నారు. అందుకోసమే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వాటన్నింటినీ ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తల పైనే ఉందన్నారు. గడచిన నాలుగేళ్ల కాలంలో దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు. అనేక పథకాల అమలులో ఇతర రాష్ట్రాలకు కేసీఆర్ ప్రభుత్వం మార్గదర్శకంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే బాధ్యత ఖమ్మం జిల్లా నేతలపై పడిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ తరహా శిక్షణ ఇస్తామన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో గులాబీ జెండాను అన్ని గ్రామాల్లో ఎగురవేయాల్సిన బాధ్యత నేతల పైనే ఉందన్నారు. కార్యకర్తలను దేశంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మార్చాల్సిన బాధ్యత నేతలదేనన్నారు. తమ నేత జాతీయ స్థాయిలో ఇతర నేతలకు మార్గదర్శకంగా ఉంటుంటే నియోజకవర్గ నేతల్లో కొందరు పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేదిలేదని హెచ్చరించారు.
పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పార్టీ బలంగానే ఉన్నప్పటికీ ఇతర పార్టీలకు అవకాశం దక్కకుండా మరింత బలంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయి ప్రభుత్వ పథకాలను తెలియచెబుతూ అందించాల్సిన బాధ్యత నియోజకవర్గ నేతలదేనని కడియం, తుమ్మల పిలుపిచ్చారు. శిక్షణలో సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, ప్రముఖ మానసిక నిపుణులు డాక్టర్ వర్లు, కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, అనేక మంది ప్రముఖులు వివిధ అంశాలపై శిక్షణ అందించారు.
చిత్రం..శిక్షణా శిబిరంలో మాట్లాడుతున్న మంత్రి కడియం