తెలంగాణ

పల్లెల్లో నకిలీ విత్తనాల బెడద..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 11: నకిలీ విత్తనాల బెడద రైతాంగాన్ని కలవరపరుస్తోంది. అసలేదో నకిలీ ఏదో తెలియని అయోమయ స్థితిలో రైతన్నలు మండలాల్లో, గ్రామాల్లో పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్న తీరు దయనీయంగా ఉంది. ఇప్పటికే పలు మండలాల్లో వెలుగు చూసిన నకిలీ విత్తనాల విక్రయ ఘటనలు, పట్టుబడిన నకిలీ విత్తనాలు సంగతి విదితమే. అప్పులు చేసి ఇంటిల్ల్లిపాదీ కష్టపడి సాగు చేసిన పంట పూత, కాతకు నోచుకోకపోతే రైతన్నకు ఎదురయ్యే నష్టం అప్పటిదాకా అతను పడిన వ్యయ ప్రయాసలను బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తుంది. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటికే మునుగోడు, కనగల్ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు అధికారుల తనిఖీల్లో పట్టుపడడం గమనార్హం. డిండి, దేవరకొండ, చందంపేట, నేరడుగొమ్ము, దామరచర్ల, హాలియా, కనగల్‌తో పాటు పత్తి అధికంగా సాగు చేసే మండలాల్లో నకిలీ పత్తి విత్తనాల విక్రయ యత్నాలపై ముందస్తు సమాచారం ఉండటంతో టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశారు. కొన్ని మండలాల్లో టాస్క్ఫోర్స్ అధికారులకు చిక్కకుండా స్థానిక అధికారుల ఉదాసీనతను ఆసరా చేసుకుని నకిలీ విత్తన దారులు తమ అమ్మకాలను సాగిస్తున్నట్లుగా తెలుస్త్తోంది. జిన్నింగ్ మిల్లుల్లో తయారుచేసిన నకిలీ విత్తనాలను వ్యాపారులు రైతులకు విక్రయిస్తుండటంతో అవి సరిగా మొలకెత్తక, పూతకాత రాక రైతులు చేసిన శ్రమ, పెట్టిన పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం నెలకొంది. ఇదే సమయంలో రకరకాల కంపనీల పేరుతో అందమైన ప్యాకింగ్‌లతో వస్తున్న అనుమతులు లేని కంపనీల పత్తి విత్తనాల విక్రయాలు రైతులను మరింత గందరగోళ పరుస్తుండటంతో రైతుకు విత్తన ఎంపిక విషమ పరీక్షగా మారింది.
పల్లెల్లో నిషేధిత బిటి-3పత్తి విత్తనాలు!
పల్లెల్లో ఒకవైపు నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయ సమస్యలతో సతమతమవుతున్న రైతాంగానికి కేంద్రం నిషేధించిన బిటి-3పత్తి విత్తనాల విక్రయం మరో సమస్యగా తయారైంది. మహాబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి అక్రమంగా ఉత్పత్తి అవుతున్న బిటి-3విత్తనాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పల్లెల్లో సైతం విక్రయిస్తుండటంతో నిషేధిక విత్తనంపై అవగాహన లేని రైతులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది బిటి-3పత్తి విత్తనాలు సరైన దిగుబడులు అందించకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని తెలంగాణ జిల్లాల్లో పది లక్షల ఎకరాల్లో బిటి-3విత్తనాలు సాగైనట్లుగా కేంద్ర పరిశోధన సంస్థలు నిర్ధారించాయి. కొన్ని పత్తిసంస్థలు రైతుల ముసుగులో బిటి-3విత్తనాలను ఉత్పత్తి చేస్తు రైతులకు విక్రయిస్తున్నట్లుగా కేంద్ర వ్యవసాయ శాఖ వర్గాలు గుర్తించడంతో ఈ విత్తనాల విక్రయాల పట్ల సైతం రైతులు అప్రమ్తతంగా ఉండాల్సివస్తుంది.

చిత్రం..అధికారులకు చిక్కిన నకిలీ పత్తి విత్తనాలు