తెలంగాణ

కొత్త పంచాయతీలు సరే.. సిబ్బంది ఏరీ?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 11: పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కొత్త పంచాయతీలు సరే.. సిబ్బంది పరిస్థితేంటనే ప్రశ్న ప్రస్తుతం పల్లె జనాల మదిలో మెదులుతోంది. పాత పంచాయతీల పరిధిలోనే అరకొర సిబ్బందితో ఎలాగోలా నెట్టుకొస్తుండగా, ఇప్పుడు మరికొన్ని కొత్త పంచాయతీల ఏర్పాటుతో వాటి నిర్వహణ ఎలా సాధ్యమనే అనుమానం అందరిలో నెలకొంది. ఇప్పటికే ఒక కార్యదర్శి రెండు, మూడు గ్రామ పంచాయతీల బాధ్యతలను చూస్తుండగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నూతన పంచాయతీ రాజ్ చట్టం బిల్లును రూపొందించి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించుకున్న సంగతి అందరికి తెలిసిందే. గ్రామ పంచాయతీ పాలకవర్గాల విధి విధానాలతోపాటు నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు ప్రక్రియ గురించి బిల్లులో పేర్కొన్నారు. 500 జనాభా కలిగిన ఆవాస గ్రామాలు, తండాల్ని కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి, ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం కొత్తవి, పాతవి కలుపుకొని మొత్తం 1211 గ్రామ పంచాయతీలున్నాయి. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పాత వాటితోపాటు కొత్త పంచాయతీలకు ఎన్నికలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయితీ పాలకవర్గం ఏర్పడమనేది ఎన్నికల ప్రక్రీయ ద్వారా జరుగుతుంది. కానీ, ప్రజలకు సేవలందించే సిబ్బందిని మాత్రం ప్రభుత్వమే నియమించాల్సి ఉంటుంది. అయితే, సిబ్బంది అవసరాల్ని సర్కార్ గుర్తించడం లేదనే ఆరోపణలు పల్లెల్లో విన్పిస్తున్నాయి. ఇప్పటికే ఒక కార్యదర్శికి రెండుమూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఏ ఊరికి న్యాయం చేయలేని పరిస్థితి నెలకొనగా, కార్యదర్శుల కోసం గ్రామాల్లో ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. పజలకు వివిధ సేవలందించేందుకు కనీసం ఎనిమిది సిబ్బంది ఉండాల్సి ఉంటుంది. ప్రతి గ్రామంలో పంచాయతీ వ్యవహారాలు, రికార్డుల నమోదుకు ఒక కారోబార్, ప్రజలకు నీళ్లందించేందుకు పంపు ఆపరేటర్ (వాటర్‌మెన్), వీధి దీపాలు, ఇతర ఎల్రక్టిషియన్ పనులకు ఒక ఎలక్ట్రిషియన్ తప్పనిసరి. వీరితోపాటు వీధులను శుభ్రం చేయడం, మురుగుకాలువలు శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడం వంటి చర్యలకు సిబ్బంది అవసరం. అయితే, జనాభాకు అనుగుణంగా వీరి సంఖ్య ఉంటుంది. ప్రభుత్వం ఇటీవల కొత్త పంచాయితీలను ఏర్పాటు చేయగా, పూర్తి సిబ్బంది లేకుండా పంచాయతీల నిర్వహణ, జనాల బాగోగులు చూడటం సాధ్యమేనా అనే ఆలోచన అటు పల్లె జనాల మదిలో, ఇటు పాలన పగ్గాలు చేపట్టాలని తహతహలాడుతున్న ఆశావహుల మదిలో మెదులుతోంది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయి సిబ్బందిని నియమిస్తే పంచాయతీ నిర్వహణ బాగుంటుందనే భావన వారిలో నెలకొంది. కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ విషయంలో కూడా ఆలోచించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.