తెలంగాణ

పర్యాటక రంగంలో తెలంగాణ నెం.1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: పర్యాటక రంగంలో దేశంలోనే తెలంగాణను నెంబర్-1గా చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పన్యాల భూపతి రెడ్డి తెలిపారు. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన పన్యాల భూపతి రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సోమవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ థాయ్‌ల్యాండ్, సింగపూర్, మలేషియా వంటి దేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని అన్నారు. అదే తరహాలో దేశ, విదేశీయులు తెలంగాణను సందర్శించే విధంగా పర్యాటక ప్రాంతం (రాష్ట్రం)గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. తెలంగాణను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఉన్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల ప్రకారం తాను కృషి చేస్తానని, అన్ని జిల్లాల్లో పర్యటించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలు సందర్శించేలా బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాల్లోని నదులను మినీ ట్యాంక్ బండ్‌లుగా తీర్చిదిద్ది, బోటింగ్ సౌకర్యం కల్పిస్తామని, చుట్టూర గ్రీనరీ చేయించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ, మేడిగడ్డ తదితర అన్నీ నీటి పారుదల ప్రాజెక్టులనూ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులకే కాకుండా రోజంతా ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునే మన రాష్ట్ర ప్రజలూ సాయంత్రం కుటుంబ సభ్యులతో ఆయా ప్రాంతాలను సందర్శించేలా చేస్తామని ఆయన తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవిలో నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి అన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న భూపతి రెడ్డి