తెలంగాణ

గోదావరికి పెరిగిన వరద ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్11: ఎగువ మహారాష్టల్రో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మహారాష్టల్రోని బాబ్లీ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పోటెత్తడంతో సోమవారం నాలుగు గేట్లు ఎత్తివేసి దిగువ గోదావరిలోకి వదలడంతో బాసర వద్ద గోదావరి జలకళ ఉట్టిపడింది. బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో 98,873 క్యూసెక్కుల నీరు దిగువ గోదావరికి వచ్చి చేరినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. నిన్నమొన్నటి వరకు ఏడారిలా తలపించిన బాసర వద్ద గోదావరి జలకళ ఉట్టిపడుతోంది. జూన్ రెండో వారంలోనే బాసరకు భారీగా వరదనీరు పోటెత్తడం గత పదేళ్ళలో ఇదే మొదటిసారి అని స్థానికులు తెలిపారు. బాసర నుండి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరకు వరద నీరు మంగళవారం మధ్యాహ్నం వరకు చేరుకొని 2 టీఎంసీల నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని ఎస్‌ఆర్‌ఎస్పీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర వరదలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా భైంసా సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం నీటి మట్టం 356.8 మీటర్లు కాగా గత రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి రెండు మీటర్ల మేర వరద నీరు పెరిగినట్లు తెలిపారు. భైంసా డివిజన్‌లో సోమవారం 6 సెం.మీటర్ల వర్షపాతం నమోదుకాగా స్వర్ణ ప్రాజెక్టులోకి కూడా భారీగానే వదర నీరు వచ్చిచేరింది. స్వర్ణ ప్రాజెక్టు నీటి మట్టం 1183 అడుగులు కాగా 2400 క్యూసెక్కుల వరద నీరు చేరడంతో 1062 అడుగుల స్థాయికి నీటి మట్టం చేరుకుంది. ఈ రెండు ప్రాజెక్టుల్లోకి వరద నీటి ఇన్‌ఫ్లో పెరగడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే లోయర్ పెన్ గంగా ప్రాజెక్టుల్లోకి కూడా ఎగువ మహారాష్ట్ర నుండి వరద ప్రవాహం పెరగడంతో చెనాకకోర్ట బ్యారేజి పనులను సైతం నిలిపివేశారు.
ఆదిలాబాద్ జిల్లాలోని బజార్‌హత్నూర్ మండలం కొల్హారి అంతర్‌రాష్ట్ర వంతెన పైనుండి వరదనీరు ఉప్పొంగడంతో ఇరువైపుల నాలుగు గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి. మహారాష్ట్ర నుండి వచ్చే వాహనాలు అక్కడే నిలిపివేయాల్సి వచ్చింది. మరోవైపు జన్నారం మండలం ఇందన్‌పెల్లి వద్ద ఇటీవలే నిర్మించిన లోలెవల్ వంతెన పైనుండి వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో సాయంత్రం 5 గంటల వరకు కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది.

చిత్రం..బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో జలకళతో ఉట్టిపడుతున్న బాసర గోదావరి