తెలంగాణ

కార్పొరేట్ కాలేజీల ఫీజు దోపిడీని అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల ఫీజు దోపిడిని అరికట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీసీ భవన్‌లో జరిగిన బీసీ విద్యార్ధుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. కార్పోరేట్ విద్యా సంస్థలు అడ్డు, అదుపు లేకుండా లక్షల ఫిజుల వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో కాలేజీలను స్థాపించిన నారాయణ, చైతన్య, గాయత్రి సంస్థలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకర్శినీయమైన ప్రకటనలు ఇస్తూ, బ్రోకర్ల ద్వారా విద్యార్ధులను ఆయా కాలేజీల్లో చేర్పించుకొని అనంతరం తల్లిదండ్రుల వద్ద ముక్కుపిండి ఫీజులను వసూలు చేస్తున్నారని అన్నారు. ఒకే యాజమాన్యం క్రింద ఒకే విద్య సంస్థ నిబందనను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ఈ అరాచకాన్ని తగ్గించవచ్చునని అన్నారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు విద్యార్థులను మనుషుల్లా కాకుండా యంత్రాలుగా చూస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఆందోళనతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం ఆయా విద్యా సంస్థలపై చర్యలు తీసుకోక పోవడం సరికాదని అన్నారు.
బీసీలకు పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించాలి....
బీసీ విద్యార్ధుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఫీజు మంజూరు చేస్తోందని, మైనారిటీ వర్గాలకు రాష్ట్రం ప్రభుత్వం పూర్తి రియంబర్స్‌మెంట్ చెల్లిస్తోందని అన్నారు. ప్రభుత్వం హిందు బీసీల విషయంలో పరిమితి విధించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఎలాంటి పరిమితులు లేకుండా బీసీలందరికీ పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు.