తెలంగాణ

జూలై 10 నాటికి పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న రైతు జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని జూలై 10 నాటికి పూర్తి చేయాలని అధికారులకు వ్యవసాయ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రైతుబంధు, రైతు జీవిత బీమా కార్యక్రమాలపై సమీక్షించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ఇంటింటికి వెళ్లి పట్టాదారు రైతులను రైతుబంధు జీవిత బీమాలో నమోదు చేసుకునేలా చూడాలని కోరారు. విస్తరణ అధికారులు సేకరించిన రైతుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్యాబ్‌లలో ఇంగ్లీష్‌లో నింపి ఎల్ ఐసీ వారికి అందచేయాల్సి ఉంటుందని తెలిపారు. రైతు బందు పోర్టల్‌లోనే రైతు బీమాకు సంబంధించిన పోర్టల్‌ను కూడా ఏర్పాటు చస్తున్నట్టు తెలిపారు. రైతుల వివరాలను జిల్లా వ్యవసాయ అధికారులు విశే్లషించుకొని రాబోవు 30రోజుల్లో రైతులు బీమాలో నమోదు చేసుకునేటట్లు చూడాలని, ఇందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమాలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా నమోదు జరిగేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు జరిపి క్రింది స్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేయాలని కోరారు. బీమాకు ఆధార్‌కార్డులోని వయస్సునే ప్రామాణికంగా తీసుకోవాలని, పుట్టిన తేదీ వివరాలు లేని వారికి జూలై 1తో నింపాలని సూచించారు. 14 ఆగస్టు 1959 నుంచి 15 ఆగస్టు 2000లోపు పుట్టిన వారే ఈ పథకానికి అర్హులని దీనిని దృష్టిలో ఉంచుకొని నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రతి రైతు బీమా చేసుకునేలా అధికారులు ప్రోత్సహించి, వారికి సహకరించాలని కోరారు.
రైతుబంధు చెక్కులను
వివరాలను పంపండి ...
పథకం క్రింద ఇంకా రైతులకు అందని చెక్కుల వివరాలు, క్యాన్సల్ అయాన చెక్కుల వివరాలు, చనిపోయిన, ఎన్‌ఆర్‌ఐ రైతుల వివరాలను వెంటనే పంపాలని కోరారు. పాసుబుక్కులు లేకుండా కలెక్టర్ల సూచన ప్రకారం పంపిణీ జరిగిన చెక్కుల వివరాలతో పాటు చెక్కులను వెనక్కి అందజేసిన రైతుల వివరాలను కూడా అందజేయాలని కోరారు. వివిధ కారణాలతో పంపిణీ కాకుండా మిగిలిపోయిన రైతుబంధు చెక్కులను తిరిగి వెనెక్కి పంపించాలని అధికారులను ఆయన ఆదేశించారు.