తెలంగాణ

దళితులపై చిత్తశుద్ధి ఉన్నది మా పార్టీకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: దళితుల పట్ల చిత్తశుద్ది ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటేనని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన కేసీఆర్, చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరంగల్‌లో జరిగిన సభ పార్టీల గర్జన సభగా మారిందని, సిద్దాంతాలు మరించి భావసారూప్యం లేని పార్టీలతో అపవిత్ర కలయికలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటకలో సిద్దాంతాలకు తిలోదకాల్చి బీజేపీపై ద్వేషంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీలు చేతులు కలపడం దేనికి సంకేతాలని ప్రశ్నించారు. దళితల్లో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ ఏనాడు ప్రయత్నించలేదని దుయ్యబట్టారు. దేశానికి అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ దళిత, గిరిజనులను కేవలం ఓటర్లుగానే చూస్తూ వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో జరిగినన్ని అత్యాచారాలు ఏనాడు జరగలేదని, యూపీ ఏ కేంద్రంలో ఉండగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అత్యాచారాలు, ఆకృత్యాలు వరంగల్ సభలో పాల్గొన్న నేతలకు గుర్తుకురాకపోవడం నిజంగా హేయనీయమని అన్నారు.
22న అమిత్ షా రాక
ఇలాఉండగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు. షా మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. షా పర్యటన ఖరారు కావడంతో ఇదివరకే ఖరారు చేసుకున్న బస్సు యాత్రను వాయిదా వేసుకోవాలని బిజెపి రాష్ట్ర నేతలు భావిస్తున్నారు.