తెలంగాణ

దుర్గాప్రసాద్‌ను కోర్టులో హాజరు పర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ డెమోక్రాటిక్ ఫోరం కో కన్వీనర్ దుర్గాప్రసాద్‌ను కోర్టులో హాజరుపర్చాలని పౌరహక్కుల సంఘం నాయకుడు వరవరరావు, పలువురు ప్రజా సంఘం నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న దుర్గాప్రసాద్‌ను ఇంతవరకు కోర్టులో హాజరు పర్చలేదని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి దృష్టికి తెచ్చారు. సోమవారం హోంమంత్రిని వరవరరావు, పలువురు ప్రజాసంఘాల ప్రతినిధులు కలిసి దుర్గాప్రసాద్‌ను కోర్టులో హాజరు పర్చేవిధంగా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఇందుకు హోంమంత్రి స్పందిస్తూ పోలీసుల అదుపులో ఉంటే తప్పకుండా కోర్టులో హాజరు పర్చే విధంగా ఆదేశిస్తానని హామీ ఇచ్చారు.