తెలంగాణ

ఎన్‌ఐఎన్‌లో మూడు కొత్త పీజీ కోర్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) లో కొత్తగా మూడు పీజీ కోర్సులు ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థలో ఎంఎస్‌సీ (అప్లైడ్ న్యూట్రిషన్) కోర్సు నడుస్తోంది. 2018-19 సంవత్సరం నుండి ఎంఎస్‌సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్), ఎంఎస్‌సీ (స్పోర్ట్స్ ఫిజియాలజీ), ఎంఎస్‌సీ (స్పోర్ట్స్ బయో-కెమిస్ట్రీ) కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ఈ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్. హేమలత తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ మూడు కోర్సులను ఉస్మానియా యూనివర్సిటీతో అఫిలియేషన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఎన్‌ఐఎన్-ఉస్మానియా యూనివర్సిటీ మధ్య అవగాహనా ఒప్పందం కుదర్చుకుంటున్నారు. ఈ కోర్సుల అడ్మిషన్లకు సంబంధించి వారం, పదిరోజుల్లో నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉంది.