తెలంగాణ

పారదర్శకంగా బదిలీలను నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి లక్ష్మారడ్డె అధికారులను ఆదేశించారు. సోమవారం ఆరోగ్యశ్రీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో మంత్రి సంబందిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మొదటి సారి నిర్వహిస్తున్న బదిలీల్లో ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నందున పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. బదిలీల ప్రక్రియలో ధరఖాస్తుల స్వీకరణ, ఖాళీల వివరాల, అభ్యంతరాల స్వీకరణ, జాబిత ప్రకటన వంటి వివిధ స్థాయిల్లో వచ్చే సమస్యలను ఆ స్థాయిలోనే పరిష్కరించుకోవాలన్నారు. పూర్తి ఆన్‌లైన్ పద్దతిలో బదిలీలు జరగనున్నందున ఆ విధానాలపై ఉద్యోగులకు మొదట అవగాహన కల్పించి ఎలాంటి అనుమానాలకు తావులేకుండా బదిలీలు సక్రమంగా సాగేలా చూడాలని కోరారు.