తెలంగాణ

జూన్ చివరివరకు 10 కోట్ల పనిదినాలను కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ వ్యాప్తంగా 2018 జూన్ చివరి వరకు పదికోట్ల పనిదినాలను కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సచివాలయం నుండి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. గత ఏడాది జూన్ చివరివరకు 8.68 కోట్ల పనిదినాలను కల్పించామని గుర్తుచేశారు. రాష్ట్రంలో 50 లక్షల 80 వేల మందికి జాబ్‌కార్డులు ఇచ్చామని, వీరిలో 60 శాతం మందికైనా 100 రోజుల పనిదినాలను కల్పించాలని ఆదేశించారు. ఉపాధికూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించాలని సూచించారు. మరో పదిరోజుల్లో గ్రామాల్లో రోడ్లపక్కన హరితహారం కింద మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. అక్టోబర్ 2 వరకు నిర్మాణంలో ఉన్న 1223 పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అంగన్‌వాడీ భవనాలన్నింటినీ ఆగస్టు 15 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు.