తెలంగాణ

మీకు తోడుగా మేమున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: ఎదిగిన, చేతికి అందిన పిల్లలు పట్టించుకోకపోవడం, విదేశాల్లో స్థిరపడి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం వంటి ఎన్నో హృదయవిదారకరమైన సంఘటనలు చూస్తున్నాం. పిల్లల నిర్లక్ష్యం కారణంగా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వృద్ధ తల్లిదండ్రులకు బాసటగా ఉండాలని, ‘చేయూత’నివ్వాలని ‘ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్’ నడుం బిగించింది. అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతున్న వృద్ధులకు ‘మేమున్నాం, మీకు తోడుగా..’ అని చెప్పేందుకు ఇటీవల ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరిట స్థాపించామని, ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సిఇవో మందడి కృష్ణారెడ్డి సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ గౌరవ చైర్మన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య, చైర్మన్ విశ్రాంత డిజిపి గోపినాథ్ రెడ్డి, సీనియర్ పాత్రికేయుడు దిలీప్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పౌండేషన్ సిఇవో మాట్లాడుతూ ప్రపంచ వృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు దేశంలోనే అతి పెద్ద వృద్దుల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. దోమల్‌గుడాలోని ఎవి కళాశాలలో వృద్దుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వృద్దులపై హింసను నిరసిస్తూ ఈ నెల 15న ఉదయం 7 గంటలకు నెక్లెస్ రోడ్డులో వృద్దులతో ‘వౌన ప్రదర్శన’ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. జస్టిస్ చంద్రయ్య అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, రాష్ట్ర మహిళా, వయోధిక, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, జిహెచ్‌ఎంసి కమిషనర్ బి. జనార్ధన్ రెడ్డి, వికలాంగులు, వయోధిక సంక్షేమ శాఖ సంచాలకురాలు శైలజ హాజరవుతారని ఆయన వివరించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఎవి కళాశాల ప్రాంగణంలో వృద్ధుల సమ్మేళనాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. 17న ముగింపు సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హాజరవుతారని ఆయన చెప్పారు. వృద్దుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని వృద్దులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ఉచితంగా మందులు, అవసరమైన పరికరాలు అందిస్తామని ఆయన తెలిపారు. 50 సంవత్సరాల పైబడిన వారంతా ఈ సమ్మేళనంలో పాల్గొనాలని మందడి కృష్ణారెడ్డి కోరారు.
జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ ఒంటరితనంతో జీవించే వారికి, మానసిక వత్తిడి కారణంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వృద్దాప్యంలో జీవితాలు దుర్భరంగా గడపాల్సి రావడం బాధాకరమని అన్నారు.
చైర్మన్ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థలు చిన్నా,్భన్నం కావడం విచారకరమని అన్నారు. పెద్దలను కాపాడుకునేలా పిల్లలను చైతన్యవంతం చేయాల్సి ఉందని, ఈ సమ్మేళనం అన్ని విధానాల ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. సీనియర్ పాత్రికేయుడు దిలీప్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమ్మేళనం ద్వారా సమాజానికి మంచి సంకేతం ఇచ్చినట్లు అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఇటీవల నిజామాబాద్‌లో వృద్దతల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోవడంతో, ఇరుగు-పొరుగు వృద్దులు, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వృద్దులు ఆ వృద్దుల కుమారుని ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టి ఆ కుమారులకు కనువిప్పు కలిగేలా చేశారని ఆయన తెలిపారు.