తెలంగాణ

ధరణి’కి తప్పని తిప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: ‘్భ రికార్డుల ప్రక్షాళన జాగ్రత్తంగా చేయాలని హెచ్చరించాం. కొంత సాంకేతిక సమస్యలకు తోడు కొందరు ఉద్యోగుల తప్పిదాల వల్ల చాలా చోట్ల పాసు పుస్తకాలు తప్పుల తడకగా ఉన్నట్టు ప్రభుత్వానికి సమాచారం అందింది. రికార్డులు తప్పుల తడకగా ఉంటే ‘్ధరణి’ వెబ్‌సైట్ ప్రారంభించడం సాధ్యం కాదు’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నంత పని అయింది. రాష్టవ్య్రాప్తంగా జిల్లాకో మండలంలో ప్రవేశ పెట్టిన ‘్ధరణి’ వెబ్‌సైట్ ప్రయోగాత్మకం ఫలించలేదు. దీంతో రాష్టవ్య్రాప్తంగా అమలు మరింత జాప్యం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుత భూ రిజిస్ట్రేషన్ల విధానం లోపభూయిష్టంతో పాటు అవినీతి, జాప్యం, గందరగోళం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ విధానానికి స్వస్తిపలికి పారదర్శకం, వేగవంతం, అవినీతిరహితంగా సంస్కరణలు తీసుకవచ్చేందుకు ‘్ధరణి’ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనిని ప్రయోగాత్మకంగా గత మే 5 నుంచి మొదటి విడతలో ఐదు మండలాల్లో, రెండవ విడత మే 19 నుంచి జిల్లాకో మండలం చొప్పున 30 మండలాల్లో ప్రవేశ పెట్టింది. అలాగే భూ రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే కాకుండా ఇక నుంచి అన్ని తహిసీల్దార్ కార్యాలయాల్లో అమలుకు శ్రీకారం చుట్టింది. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో మాదిరిగా తహిసీల్దార్ కార్యాలయాలలో ఉన్న సిబ్బందికి ఈ ప్రక్రియపై అవగాహన, శిక్షణ లేకపోవడంతో ‘్ధరణి’ వెబ్‌సైట్ ప్రయోగం ఫలించేలా లేదని వాపోతున్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అయితే నిపుణులైన సిబ్బంది ఉండగా తహిసీల్దార్ కార్యాలయాలోని సిబ్బందికి పెద్దగా అవగాహన లేకపోగా కనీసం శిక్షణా కూడా ఇవ్వలేదు. కేవలం ధరణిపై తహిసీల్దార్లకు మాత్రమే శిక్షణ ఇవ్వడంతో కిందిస్థాయి సిబ్బందికి అవగాహన లేకపోవడం ప్రధాన లోపంగా మారింది. దీనికి తోడు నియోజకవర్గ కేంద్రాల్లోని మండల కార్యాలయాలకు తప్ప మారుమూల మండల కార్యాలయాల్లో జనరేటర్లు సదుపాయం లేదు. విద్యుత్ సరఫరా ఆగిపోతే ఇంటర్నేట్ పని చేయక ధరణి వెబ్‌సైట్‌లో ఓపెన్ కావడం లేదని వాపోతున్నారు. కొన్ని చోట్ల కంప్యూటర్లకు బ్యాటరీ బ్యాకప్ ఉన్నప్పటికీ సర్వర్లు స్లోగా ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ చేసే పత్రాలు అప్‌లోడ్ కావడం లేదని మండలాల నుంచి పై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ‘్ధరణి’ వెబ్‌సైట్ కొత్తది కావడం వల్ల మండల కార్యాలయాల్లోని ఉద్యోగులకు అవగాహన లేకపోవడంతో సమాచారం నమోదులో పొరపాట్లు జరిగితే సరి చేయడానికి కరక్షన్ ఆప్షన్ లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని వాపోతున్నారు. ‘్ధరణి’ వెబ్‌సైట్‌కు సాఫ్ట్‌వేర్ రూపొందించిందని సర్వీస్ ప్రొవైడర్ అయిన ఐఎల్‌ఎఫ్, కిందిస్థాయి ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టుగా లేదని, ఇది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కూడా అర్థం కానీ రీతిలో ఉందని వాపోతున్నారు. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన మండలాల్లోనే ‘్ధరణి’ ఫలించకపోవడంతో రాష్టవ్య్రాప్తంగా అమలు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చన్న సందేహాలను రెవిన్యూ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.