తెలంగాణ

తెలంగాణలో పాలన కన్నీరు పెట్టిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న అప్రజాస్వామిక పాలన తనకు కన్నీరు పెట్టిస్తోందని పార్లమెంట్ మాజీ స్పీకర్ మీరా కుమార్ అన్నారు. సోమవారం నగరంలో ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, బహిష్కృత ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లతో కలిసి ఆమె మాట్లాడారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఏర్పడ్డ రాష్ట్రంలో నియంత పాలన సాగతుండటం బాధకరమన్నారు. తెలంగాణలో ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ దళితను ముఖ్యమంత్రి చేస్తానమని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి ఇవ్వక పోగా ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదివిని సైతం తప్పించి పెద్ద తప్పిదం చేశారని అన్నారు. ప్రజాస్వామ్య, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఏర్పడ్డ రాష్ట్రంలో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన వాక్ స్వాతంత్ర హక్కు కూడా లేకుండా పోయిందని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే...
ప్రజల ఎన్నికల ద్వారా ఎన్నికైనా ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని మీరా కుమార్ అన్నారు. తాను లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశానని ఇలాంటి నిర్ణయం సభాపతి ఎలా తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న వారు పానలో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపేందుకు వివిధ పద్దతుల్లో నిరసన తెలిపే హక్కును కలిగి ఉంటారని స్పష్టం చేశారు. వాటిని కాలరాయడమే కాక, ఏకంగా సభ్యత్వాలనే రద్దు చేయడం తీవ్ర అభ్యంతకరమని అన్నారు.
చట్టాన్ని రక్షించడంలో కేంద్రం విఫలం.....
దేశవ్యాప్తంగా దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, దళిత, గిరిజనులు ఇప్పటికీ బానిసలుగా చూడబడుతున్నారని అన్నారు. ఆయా వర్గాలను రక్షణ కల్పించే చట్టాలను నీరుగార్చే కుట్ర జరగడం ఆవేదన కలిగించే అంశం అన్నారు. ఇటీవల అట్రాసిటి చట్టం విషయంలో కోర్టు వెలువరించిన తీర్పు అనంతరం ఆ చట్టాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలం చెందిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందటే కేవలం మీరాకుమార్ వల్లనేనని, దేశం గర్వించదగ్గ వ్యక్తి మీరా కుమార్ అని పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, పీసీసీ చీఫ్ ఉత్తమ్