తెలంగాణ

నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 12: విద్యారంగ అభివృద్ధి పరంగా నిజామాబాద్ జిల్లా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే తెలంగాణ యూనివర్శిటీ, ప్రభుత్వ వైద్య కళాశాల వంటి ఉన్నత విద్యా కుసుమాలతో విలసిల్లుతున్న ఇందూరుకు తాజాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ అధికారికంగా ఉత్తర్వులు వెలువరించింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థను మంజూరు చేయడం పట్ల నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితమే ఒక కేంద్రీయ విద్యాలయాన్ని బోధన్‌కు మంజూరు చేయగా, తాజాగా ఇందూరుకు కూడా కేటాయించడంతో నాలుగేళ్ల వ్యవధిలోనే రెండు విద్యా సంస్థలను నిజామాబాద్ జిల్లా దక్కించుకున్నట్లయ్యింది. దేశ వ్యాప్తంగా మొత్తం 50 విద్యా సంస్థలను మంజూరు చేయగా, అందులో నిజామాబాద్‌కు కూడా స్థానం కల్పించారు. ప్రస్తుత 2018-19 విద్యా సంవత్సరం నుండే కేంద్రీయ విద్యాలయంలో తరగతులను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు తాత్కాలికంగా నాగారం ప్రాంతంలోని డైట్ కళాశాలకు చెందిన భవనాలను తరగతుల నిర్వహణ కోసం వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం తొలి ఏడాది ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ప్రవేశాలు కల్పించడం జరుగుతుందని, అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతంగా చేపట్టి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. వీలును బట్టి మునుముందు కేంద్రీయ విద్యాలయాన్ని అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇదివరకు హెచ్‌ఆర్‌డీ శాఖా మంత్రిగా కొనసాగిన స్మృతి ఇరానీతో పాటు, ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రకాశ్ జవడేకర్‌ను ఎం.పీ కవిత పలు పర్యాయాలు కలిసి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాల్సిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ద్వారా ఎంత త్వరగా స్థలాన్ని కేటాయిస్తే అంత త్వరగా కేంద్రీయ విద్యాలయాన్ని నెలకొల్పుతామని తనను కలిసిన నిజామాబాద్ జిల్లా బీజేపీ నాయకులతో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక నిర్వహణ కోసం నాగారం ప్రాంతంలోని డైట్ కళాశాలకు చెందిన భవనాలను కేటాయించడంతో ఎట్టకేలకు కేంద్రం ఈ విద్యా సంస్థను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు వెలువరించింది.
మొత్తం మీద నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడంతో విద్యార్థులకు మరింత మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి వచ్చినట్లయ్యిందని వారి తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.