తెలంగాణ

అధికారం కోసమే అపవిత్ర పొత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని, మతోన్మాద మజ్లిస్ పార్టీ నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే బీజేపీకి రాష్ట్ర ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. లౌకికతత్వం గురించి మాట్లాడే మజ్లిస్, టీఆర్‌ఎస్ పార్టీతో ఎలా పొత్తుపెట్టుకుంటుందని ఆయన నిలదీశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల వల్లే యువత, ఆయా పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారని, బీజేపీ దేశవ్యాప్తంగా విజయకేతనం ఎగురవేస్తుందని అన్నారు.
కర్నాటకలో బీజేపీ విజయం సాధించినప్పటికీ అపవిత్ర కలయికల ఫలితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని అన్నారు. మోదీ విధానాలు, ప్రజా సంక్షేమ పథకాల వల్లే కర్నాటకలో అధిక సీట్లు సాధించగలిగామని అన్నారు. పేదల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, విధానాలు నేరుగా ఎదుర్కోలేని ప్రతిపక్ష పార్టీలు తామేం అయినా పర్వాలేదని, మోదీ మాత్రం అధికారంలోకి రాకూడదన్నట్టు వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నట్టు నటిస్తూ దేశమంతా కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీలు ఒక్కటిగా ఉంటున్నాయని ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.