తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లకు నిధుల సమస్యలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: రబీలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి నిధుల సమస్యలేదని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. నిధుల కొరతతో ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు జరగడం లేదని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది యాసంగిలో పౌరసరఫరాల శాఖ 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు వరకు రాష్టవ్య్రాప్తంగా ఏర్పాటు చేసిన 3,300 కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు 5.07లక్షల మంది రైతుల నుంచి రూ. 5,590 కోట్లు విలువ చేసే 35లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసిందని, కొనుగోళ్లపై కమిషనర్ అకున్ సబర్వాల్ నిత్యం క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడుతూ ఫలితాలు రాబట్టారని వివరించారు. ఆన్‌లైన్ వ్యవస్థతో దళారి వ్యవస్థను మొత్తం రూపుమాపి, రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు లక్షల మంది రైతులకు రూ.4874 కోట్లను పారదర్శకంగా చెల్లింపులు జరిపినట్టు పేర్కొన్నారు.