తెలంగాణ

18 నుండి డీసెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: రెండేళ్ల డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ కోర్సులో చేరేందుకు ఈ నెల 18వ తేదీ నుండి రెండు రోజుల పాటు డీసెట్ అభ్యర్ధుల సర్ట్ఫికెట్ల పరిశీలన చేపడుతున్నట్టు కన్వీనర్ సి హెచ్ రమణకుమార్ తెలిపారు. వెబ్ ఆధారిత ఆప్షన్లను ఈ నెల 20 నుండి 22 వ తేదీ వరకూ ఇవ్వాలని, సీట్ల కేటాయింపు 25, 26 తేదీల్లో జరుగుతుందని చెప్పారు. ఫీజులను 26, 27 తేదీల్లో చెల్లించాలని, అడ్మిషన్ లేఖలను 26 నుండి 30వ తేదీ వరకూ డౌన్‌లోడ్ చేసుకుని కాలేజీల్లో రిపోర్టు చేయాలని, ఒకటో తేదీ నుండి క్లాసులను నిర్వహిస్తామని అన్నారు. ప్రతి జిల్లాలో ఉన్న డైట్‌లలో సర్ట్ఫికెట్ల పరిశీలనలకు ప్రత్యేక బృందాలను నియమించామని, ఎలాంటి తాత్సారం లేకుండా వారు సర్ట్ఫికెట్ల పరిశీలన చేస్తారని రమణకుమార్ తెలిపారు. ప్రభుత్వ డైట్‌లలో 2,385 రూపాయలు, ప్రైవేట్ డైట్‌లలో రూ.12,500 ఫీజుగా చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 632288540 నెంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవాలని చెప్పారు.
కౌనె్సలింగ్ గడువు పొడిగించాలి: ఎస్‌టియు
ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూలులో ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు సోమవారంతో పూర్తయిందని, కనుక మరికొంత గడువు పొడిగించాలని ఎస్‌టియు అధ్యక్షుడు జి భుజంగరావు, ప్రధానకార్యదర్శి జి సదానందం గౌడ్ పేర్కొన్నారు. ఇంత వరకూ మొత్తం 75,317 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో ప్రారంభం నుండి చివరి రోజు వరకూ అనేక అభ్యంతరాలతో తీవ్ర గందరగోళం ఏర్పడి ఉపాధ్యాయుల్లో విపరీతమైన ఒత్తిడి పెరిగి, దరఖాస్తుల ప్రక్రియ ముగిసిందని వారు చెప్పారు.
పాలిటెక్నిక్ ఆప్షన్లకు ముగిసిన గడువు
పాలిటెక్నిక్‌లో మెరుగైన అవకాశాలకు ఆప్షన్లను ఇచ్చే గడువు 12వ తేదీతో ముగిసింది. సీట్ల కేటాయింపు 13న జరుగుతుందని సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. కాగా షార్టుహ్యాండ్, ఇతర టెక్నికల్ పరీక్షలను జూలై ఆగస్టులో నిర్వహిస్తున్నామని వివరాలకు సాంకేతిక విద్యా శాఖ వెబ్ పోర్టల్‌ను సందర్శించాలని ఎస్‌బిటిఇటి కార్యదర్శి డి వెంకటేశ్వర్లు చెప్పారు.
ఎమ్సెట్ రిపోర్టింగ్ గడువు పెంపు
ఎమ్సెట్ వెబ్ ఆప్షన్లలో సీట్లు పొంది కాలేజీల్లో రిపోర్టు చేయడానికి గడువును ఈ నెల 14 వరకూ పొడిగించినట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.