తెలంగాణ

తెలంగాణకు సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు మైసూర్‌లోని ‘సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (సీఎఫ్‌టీఆర్‌ఐ) ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం నుండి సేద్యం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందం మంగళవారం మైసూరు వెళ్లింది. మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ని పరిశీలించేందుకు వెళ్లిన తెలంగాణ బృందానికి కర్నాటక సాంప్రదాయంలో అక్కడి అధికారులు స్వాగతం పలికారు.
తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పంటల ఉత్పత్తుల నుండి వాల్యూ యాడెడ్ పోడక్ట్స్‌ను తయారు చేసే యూనిట్లను నెలకొల్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఉన్నతస్థాయి బృందం కర్నాటక పర్యటనకు వెళ్లింది. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు మంత్రి పోచారం, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందం కర్నాటక రాష్ట్రానికి వెళ్లింది. పంటల నుండి ఉపఉత్పత్తులను (బైప్రొడక్ట్స్‌ను) తయారు చేయడంలో సిఎఫ్‌టీఆర్‌ఐ పేరు తెచ్చుకున్నది.
పసుపు ప్రాసెసింగ్ టెక్నాలజీపై తెలంగాణ బృందం ఆసక్తి కనబరచింది. పసుపు నుండి వంటకు వాడే పసుపు పౌడర్ తయారీ, పారిశ్రామిక అవసరాలకు వాడే కర్కుమిన్, పోలేయారెజిన్ తదితర ఉత్పత్తులను తయారుచేసే విధానాన్ని పరిశీలించారు. రోజూ ఇళ్లల్లో వాడే అల్లం, వెల్లుల్లి ముద్దను కల్తీలేకుండా తయారు చేసే పద్ధతిని పరిశీలించారు. ఈ తరహా మిశ్రమాన్ని తెలంగాణ గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా తయారు చేసే అవకాశం గురించి తెలుసుకున్నారు. అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారీ, ప్యాకింగ్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. తక్కువ ఖర్చుతో ఈ తరహా యంత్రాలను తెలంగాణలో ఏర్పాటు చేసుకోవచ్చని సీఎఫ్‌టీఆర్‌ఐ అధికారులు వివరించారు. కాయగూరలను రెడీటూ యూజ్ విధానాన్ని ఏ విధంగా చేపట్టవచ్చో తెలుసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సిఎఫ్‌టీఆర్‌ఐ ఈ సందర్భంగా ప్రకటించింది. ఉద్యాన శాఖ నేతృత్వంలో సిద్ధిపేట జిల్లా ములుగులో నిర్మిస్తున్న స్పైస్ ప్లాంట్ డీపీఆర్ ను సీఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ జితేందర్ జాదవ్ ఈ సందర్భంగా మంత్రి పోచారానికి అందించారు.
పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో తెలంగాణ నుండి వెళ్లిన బృందంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర శాఖ చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి ఉన్నారు.

చిత్రం..స్పైస్ ప్లాంట్‌కు సంబంధించి డీపీఆర్‌ను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి అందిస్తున్న సీఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ జితేందర్ జాదవ్