తెలంగాణ

ప్రపంచానికే సవాలు.. నకిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: నకిలీ ఉత్పత్తులు ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదని, యావత్ ప్రపంచాన్ని ఈ సమస్య పట్టిపీడిస్తోందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం నగరంలో ఇక్కడ ఫిక్కి ఆధ్వర్యంలో ‘నకిలీలు మరియు స్మగ్లింగ్‌పై పోరాటం - ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు అత్యవసరం’ అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ఈటెల మాట్లాడుతూ వాస్తవ మార్కెట్‌కు సవాలుగా నకిలీ మార్కెట్ కొనసాగుతోందని అన్నారు. నైతిక విలువల కంటే డబ్బే ప్రధానమనే భావన నుంచే ఈ నకిలీ ఉత్పతులు వస్తున్నాయని అన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల మొదలు ఆహార, ఆరోగ్యాన్ని అందించే మందులను సైతం నకిలీవి సృష్టించడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ప్రపంచంలో ఏదో ఒక మూల ఉత్పత్తి అవుతున్న వస్తువులను ఒకటి, రెండు రోజుల్లో నకిలీవి సృష్టిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇందుకోసం ఓ మార్కెటే ఉందని విజులెన్స్ అధికారులు వెల్లడించడం తనను విస్మయానికి గురిచేసిందని అన్నారు. అసలు కంటే నకిలీ ఉత్పత్తుల ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో దొరకడం విచిత్రంగా ఉందని, మెరిసేవన్ని బంగారం కాదు అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ఈ రోజు మార్కెట్‌లో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్న తీవ్ర భయాందోళనకు గురికావాల్సి వస్తుందని, నకిలీ ఉత్పత్తులను తిని ఆరోగ్యం చెడిపోతుందని అన్నారు. అనారోగ్యం నుంచి బయటపడేందుకు వాడుతున్న మందులు సైతం నకిలీవి తయారు చేయడానికి మించిన దారుణం మరొకటి ఉండదని అన్నారు. దేశంలో, ప్రపంచంలో సృష్టించబడుతున్న సంపద మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడాలి తప్ప వినాశనానికి కాదని పేర్కొన్నారు.
ఈ నేపధ్యంలో నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ నకిలీలను నియంత్రించడంలో ముందు వరుసలో నిలిచేలా చేశామని అన్నారు. ప్రపంచం మొత్తం గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చిస్తున్న సమయంలో చర్చలతో కాదు చేతలే ముఖ్యమని తెలంగాణ ప్రభుత్వం హరితహారం పధకాన్ని తీసుకువచ్చిందని అన్నారు. కోట్లాది మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ భవిష్యత్‌కు బాటలు వేస్తోందని అన్నారు. చట్టాలు చేసే వారు అమలు చేసే అధికారులు సక్రమంగా వ్యవహరిస్తే నకిలీలను, సమాజాన్ని పట్టిపీడిస్తున్న సాంఘీక దురాచారాలను అంతం చేయవచ్చునని తమ ప్రభుత్వం నిరూపించిందని చెప్పారు. రాష్ట్రంలో గుడుంబా, పేకాట రహితంగా తీర్చిదిద్దగలిగామని తెలిపారు. ఎస్‌ఓటి పోలీసులచే నకిలీ కేంద్రాలపై దాడులు చేయించి వాటిని నిరోదించగలిగామని చెప్పారు. ప్రజలు, ఉత్పత్తిదారులు సహకారం అందిస్తే నకిలీ బెడదను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిక్కి చైర్మన్ దేవేంద్ర సురానా, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ మాజీ చైర్మన్ పీసీ.ఝా, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో ప్రసంగిస్తున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్