తెలంగాణ

బలవంతపు బదిలీలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుస్తులతో పాటు వివిధ కేటగిరిల ఉద్యోగుల బదిలీల అంశంలో బలవంతపుబదిలీలకు యాజమాన్యం ప్రయత్నస్తోందని విద్యుత్ ఉద్యోగ యూనియన్లు గళం ఎత్తుతున్నాయి. దీంతో ఇటు యామాన్యం అటు ఉద్యోగుల మధ్య మాటలు తూటాళ్ళుగా పేలుతున్నాయి. ఎవరికి వారు తగ్గేదిలేదని హెచ్చరికలు చేసుకుంటున్నారు. విద్యుత్ సంస్థల్లో సంఘాలు, అసోషియేషన్లు దాదాపు 23 దాకా ఉన్నాయి. అయితే గుర్తింపు ఉన్న సంఘాలు మూడు మాత్రమైనని యాజమాన్యం చెబుతోంది. యాజమాన్యంకు అనుకూలంగా ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యత, లేనివారిని బలవంతగా దూర ప్రాంతాలకు బదిలీలు చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు రగడకు సిద్ధం అంటున్నాయి. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగస్తుల్లో దాదాపు 11వేల మందిలో ( ఒప్పంద ఉద్యోగలు కాకుండా) 20-30 శాతం మందిని బదిలీలు చేస్తున్నారు. నిరేదశిత ప్రాంతంలో ఉద్యోగి కనీసం మూడు సంవత్సరాలు పని చేయాలని యాజమాన్యం సూచించింది. మూడు సంవత్సరాలకు తక్కువ ఉన్న వారు కూడా బదిలీని కోరుకునే అవకాశం ఉందని, అయితే ఉద్యోగి కోరుకున్న ప్రాంతంలో ఖాళీ ఫోస్టు ఉండాలని, అలా లేకపోతే ఇద్దరు ఉద్యోగులు పరస్పరం బదిలీకి అంగీకారం ఉండాలన్న నిబంధన ఉంది. భార్యభర్తలు ఒకే ప్రాంతానికి బదిలీ చేసుకునే అవకాశం కల్పించామని వారికి ఒకే ప్రాంతంలో అవకాశం లేకపోతే సమీప ప్రాంతంలో ఖాళీ ఫోస్టులు ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీలకు సంబంధించి ఉద్యోగులు ఏమైనా అభ్యంతరాలు లేదా అభ్యర్థనల దరఖాస్తులకు 14 వతేదీ నాటికి ముగిసింది. ఈ నేపథ్యంలో తమ సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇవ్వాలని లేకపోతే ఆందోళన చేస్తామని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తుంటే, మీకు దమ్ముంటే ఏమి చేసుకుంటారో చేసుకోండని యాజమాన్యం హెచ్చరికలకు సిద్ధమవుతోంది. దీంతో బదిలీల ఉద్యోగులు ఆందోళన చెంతుతున్నారు. ఇప్పటికే ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన నివేదికలను యాజమాన్యం సిద్ధం చేసింది. ఈ నెల 14వ తేదీ నాటికి ఉద్యోగులు తమ అంగీకారాన్ని తెలపాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు తమకు కావాల్సిన నిర్ధేశిత ప్రాంతాలను ఎంపిక చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. డివిజన్లు, జోనళ్ళు, కేంద్ర స్థాయిలో ఉద్యోగలకు సంబంధించిన బదిలీల ప్రక్రియను ఆమోదిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. డిప్యూటి ఇంజనీర్లు 26, అదనపు డిప్యూటి ఇంజనీర్లు 87, అసిస్టెంట్ ఇజనీర్లు 243 మంది బదిలీకి యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనేపథ్యంలో బదిలీల్లో గొడవలు ప్రారంభమైయ్యాయి. జిల్లాల్లో స్థానికంగా ఉన్న ఉద్యోగులకు అక్కడే బదిలీకి అవకాశం ఉంది. జోనళ్ళుతో పాటు కేంద్ర స్థాయిలో ఉన్న ఉద్యోగులకు ఆయా ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ నెల 18 వతేదీన బదిలీ ఉత్తర్వులు వెలువడనున్నాయి, ఈనెల 25 నాటికి బదిలీ అయిన ఉద్యోగి నిరేదశిత ప్రాంతంలో బాధ్యతలు చేపట్టాలని విద్యుత్ సంస్థ ఉత్తర్వుల్లో పేర్కొంది. పదోన్నతలకు అవకాశం కల్పిస్తే కందరీగ తెట్టును కదిలించినట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దిగువ స్థాయిలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా పదోన్నతలు కల్పిస్తే బదిలీల అంశం గందరగోళం అవుతుందని డిస్కం ఉన్నతాధికారులు చెబుతున్నారు.