తెలంగాణ

మందకృష్ణ విమర్శలు అర్థరహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: వరంగల్‌లో నిర్వహించిన దళిత, గిరిజన సంహగర్జన సభకు సీపీఎం పార్టీ గైర్హారుజుపై ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేస్తున్న విమర్శలు అర్ధరహితమని సీపీఎం పార్టీ కార్యవర్గం పేర్కొంది. గురువారం పార్టీ కార్యాలయంలో పలు అంశాలపై కార్యవర్గం చర్చించింది. దళిత, గిరిజన హక్కుల కోసం జరుగుతున్న అన్ని పోరాటాల్లో తమ పార్టీ ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. సబ్‌ప్లాన్ చట్టం, అటవీ హక్కుల చట్టం, మందకృష్ణపై నిర్భందం వంటి అంశాలపై పార్టీ పాదయాత్ర నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. సుప్రీం కోర్టు తీర్పుపై తమ పార్టీ జాతీయ, రాష్టస్థ్రాయిలో వెంటనే స్పందించిందన్నారు. తెలంగాణ బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించాలని ప్రయత్నిస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్‌తో కలిసి సభను పంచుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. వరవరరావుపై హత్యకేసు మోపే ప్రయత్నం అప్రజాస్వామికమని, బీజేపీ ప్రభుత్వ కనుసన్నల్లో మహారాష్ట్ర వరవరరావును కేసులో ఇరికించేందుకే చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేసింది.