తెలంగాణ

మోదీ ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్ షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 14: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలవడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వెలువడిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్‌లో కొనసాగుతున్న ఏఐఎస్‌ఎఫ్ రాష్టస్థ్రాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో గురువారం పాల్గొన్న సందర్భంగా ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పనితీరుపై, ఇటు రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ వ్యవహారశైలిని సీపీఐ జాతీయ నేత నారాయణ తనదైన శైలిలో దుయ్యబట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ పరోక్షంగా సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తోందని, అందుకు అనుగుణంగానే మోదీ సర్కార్ జీవోలను విడుదల చేస్తోందని ఆరోపించారు. ఇది రాజ్యాంగానికి, జాతికి తీవ్ర అవమానమని, ప్రజాస్వామ్యానికీ విఘాతం కలిగించే పరిణామంగా మారిందని ఆందోళన వెలిబుచ్చారు. మోదీ ప్రభుత్వ వైఖరి వల్ల బీజేపీకి మిత్రపక్షాలు సైతం దూరమవుతున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్వవైభవం కోసం సినీ నటి మాధురిదీక్షిత్ వంటి వారి సహకారాన్ని కోరడం ద్వారా రాబోయే ఎన్నికల్లో ఓటమి తథ్యమని బీజేపీ నేతలు ముందుగానే నిరూపించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నింటినీ తమ పార్టీ ఏకం చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పరాభవం మూటగట్టుకోవడం ఖాయమని పునరుద్ఘాటించారు. ఇదిలాఉండగా, గాంధీని చంపిన గాడ్సేను పూజించే ఆర్‌ఎస్‌ఎస్ సమావేశానికి తన రాజకీయ చరమాంక దశలో మాజీ రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ వెళ్లడం ముమ్మాటికీ అవకాశవాదమేనని కే.నారాయణ అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా, రాష్ట్రంలోనూ కేసీఆర్ సర్కార్ ప్రజా సమస్యలను విస్మరిస్తూ దోపిడీ ధోరణిని కొనసాగిస్తోందని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ శిఖండి పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ ఎన్‌డీఏకు లాభం చేకూర్చేందుకే తెరపైకి తెస్తున్నారని అన్నారు. అనేక అంశాల్లో తెలంగాణ ప్రాంతానికి కేంద్రం అన్యాయం చేస్తున్నప్పటికీ, వాటి గురించి సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రం కరాఖండీగా చెబుతుంటే, దీనిపై కేసీఆర్ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. నిజంగానే కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే బయ్యారం కర్మాగారం కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి, స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ‘బాంచెన్ దొర’ అంటూ కేసీఆర్ ఢిల్లీకి పోయి మోదీ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారని దుయ్యబట్టారు. పాలకపక్షం నిస్తేజ వైఖరిని ప్రదర్శిస్తున్నప్పటికీ, బయ్యారం ఉక్కు కర్మాగారం సాధన కోసం సీపీఐ పక్షాన పోరాడుతున్నామని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్స్‌ను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని చెరకు రైతులు, కార్మికులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీయే తరహాలోనే రాష్ట్రంలోనూ తెరాస పార్టీ పట్ల అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆదరణ సన్నగిల్లుతోందని, ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి ఓట్లు దండుకోవాలనుకోవడం తెరాసకు వృధా ప్రయాసగానే మిగులుతుందని ఎద్దేశా చేశారు. ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం గౌరవించకుండా తెలంగాణను వ్యతిరేకించిన వారంతా కేసీఆర్ కేబినెట్‌లో కొనసాగుతుండడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.