తెలంగాణ

జెండా మార్చి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: సమాజంలో కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడపాలని చూసే నైజం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఉందని తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు తీవ్రంగా దుయ్యబాట్టరు. గురువారం వైసిపి పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి మోత్కుపల్లితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం మోత్కుపల్లి విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన రాజకీయ స్వార్థం కోసం ప్రజలందరినీ బలి చేస్తున్న చీడపురుగులా వ్యవహరిస్తున్నారని ఆయన కనె్నర్ర చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జెండాతో కాకుండా చంద్రబాబు తన సొంత జెండా ఏర్పాటు చేసుకుని ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
నేను ఏ తప్పూ చేయకపోయినా ఎన్టీఆర్ జెండాను దూరం చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జెండా పట్టుకుని చావాలన్నదే నా ఉద్ధేశం అన్నారు. చంద్రబాబుని రాజటీయాల్లో నుంచి భయటకు పంపాలని ఆంధ్రా,తెలంగాణ తెలుగు తమ్ములను కోరుతున్నట్లు అన్నారు. చంద్రబాబు కంటే నేనే సీనియర్ నేతనని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మానసిక పోకడలతో చాలామంది తెలుగు తమ్ముళ్ళు చచ్చిపోయారన్నారు. ముద్దు కృష్ణమనాయుడును చంద్రబాబు ఎన్నో మార్లు అవమాన పరిచినట్లు స్వయంగా తనతో ముద్దు చేప్పేవారని ఆయన అన్నారు. ఇక మిగిలింది గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నేను మాత్రమే నిలిచామని అన్నారు. తనకు బిపి, సుఘర్ అనేక రోగాలు చంద్రబాబుతో వచ్చాయని చెప్పారు. చంద్రబాబును వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఆయన ఘాటుగా విమర్శంచారు.