తెలంగాణ

బాసర ఐఐటీలో మోడల్ స్కూళ్ల విద్యార్థుల హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: ఐఐటి బాసరలో మోడల్ స్కూళ్ల విద్యార్థులు తమ సత్తా చాటారు. బాసరలోని 1500 ఐఐటి సీట్లలో 400 సీట్లు మోడల్ స్కూల్ విద్యార్థులే దక్కించుకున్నారు. గత ఏడాది మోడల్ స్కూల్ విద్యార్థులు 300 సీట్లను దక్కించుకోగా, ఈసారి మరో వంద అదనంగా దక్కించుకున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, డైరెక్టర్ సత్యనారాయణలు అభినందనలు తెలిపారు. తెలంగాణలో చదివిన విద్యార్థి ప్రపంచంలో ఎవరితో తీసిపోకుండా ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆశయ సాధనలో విద్యాశాఖ పురోగమిస్తోందని తెలిపారు. అందుకే గురుకులాలు ఏర్పాటు చేశారని అన్నారు. మోడల్ స్కూళ్లలో కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని తెలిపారు. కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్ విద్యార్థిని పోలేపల్లి స్ఫూర్తిరెడ్డి ఐఐఐటి బాసరలో టాపర్‌ల జాబితాలో ఉందని ప్రిన్సిపాల్ డాక్టర్ టి బి రూపాస్ తెలిపారు.