తెలంగాణ

పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం: కృష్ణయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు మరోమారు అన్యాయం చేసేందుకు కుట్రలు చేస్తోందని బీసీ సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఆదివారం బీసీ భవన్‌లో పంచాయతి ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని సర్పంచులుగా చేయకూడదనే కుట్రలో భాగంగానే ఇది జరుగుతోందని మండిపడ్డారు. ఇప్పటి వరకు నిర్వహించిన జనాబా లెక్కల ప్రకారం రాష్ట్రంలో సగానికి పైగా బీసీలు ఉన్నారని తేల్చుతున్నా, అందుకు తగ్గట్టుగా రిజర్వేషన్లు కల్పించకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న మొత్తం గ్రామపంచాయతీలను యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ పంచాయతీలను పక్కన పక్కన పెట్టి మిగిలిన వాటిలో మాత్రమే రిజర్వేషన్‌లుగా ప్రకటించడం బీసీలను వంచన చేయడమేనని అన్నారు. బీసీల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే వీటిని సరిచేసి ఎన్నికలను నిర్వహించాలని, లేని పక్షంలో రాష్టవ్య్రాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.