తెలంగాణ

పచ్చదనంలో దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: పచ్చదనంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచేలా అధికారులు పూర్తి తోడ్పాటును అందించాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, జోగు రామన్నలు స్పష్టం చేశారు. సోమవారం దూలపల్లిలోని తెలంగాణ అటవీ అకాడమీలో గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఉధ్యానవన అధికారుల రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైనా,బ్రెజిల్ తరువాత పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం తెలంగాణలో చేపడుతున్నట్టు చెప్పారు. బంగారు తెలంగాణ సాదనలో హరితహారం కూడా కీలకమన్నారు. ఎన్నో ఏళ్లపాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ అనేక అంశాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిస్తోందని, అదే తరహాలో హరితహారంలోనూ ఆదర్శంగా నిలిచేలా చూడాలని అన్నారు. ఇది ఏ ఒక్కరి కోసమో కాదని, అందరి కోసమని ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించి అందర్ని ఈ బృహత్తర కార్యంలో భాగస్వాములను చేయాని పిలుపు నిచ్చారు. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే 85శాతానికి పైగా మొక్కలు మనుగడ సాగించేలా పంచాయతీల పాలకవర్గాలు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక హరితహారం అని, మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని మంత్రి జోగు రామన్న అన్నారు. ఈ ఏడాది ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ రఘువీర్, అటవీ అకాడమి డైరెక్టర్ తిరుపతయ్య పాల్గొన్నారు.

చిత్రం..దూలపల్లి ఫారెస్టు అకాడెమీలో మంత్రులు జూపల్లి,జోగు రామన్న