తెలంగాణ

కమాండ్ కంట్రోల్ సూపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: నగరంలోని బంజారాహిల్స్‌లో నిర్మాంలో ఉన్న పోలీస్ కమాండ్, కంట్రోల్ సెంటర్ నిర్మాణం వేగంగా జరుగుతుండడంపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యంత ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సోమవారం సిఎం కెసిఆర్ కమాండ్ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఆయన వెంట హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్‌అండ్‌బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, డిజిపి మహేందర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో 20 అంతస్తులు, ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జరుగుతున్న నిర్మాణ పనులు ఆశించిన దానికన్నా బాగా జరగడంతో సిఎం సంతోషం వ్యక్తం చేశారు. త్వరగా నిర్మాణం పూర్తి చేసి సెంటర్ సేవలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
ఈ సెంటర్ ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తుందని సిఎం అన్నారు. కేవలం శాంతిభద్రతల పర్యవేక్షణే కాకుండా విపత్తుల నిర్వహణ, పండుగలు, జాతర్ల నిర్వహణ తదితర కార్యక్రమాలను సైతం కమాండ్ సెంటర్ నుంచి పర్యవేక్షించవచ్చని చెప్పారు. ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆరూరి రమేష్, గంగుల కమలాకర్, అరికపూడి గాంధీ, సీంజీవరావు, ఆర్‌అండ్‌బి ఈఎన్‌సి గణపతిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్