తెలంగాణ

కావాలన్నదీ వారే.. వద్దంటున్నదీ వారే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: ప్రతి ఉపాధ్యాయుడికి వారి అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు , బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వెబ్ కౌనె్సలింగ్‌ను చేపట్టిందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీచర్ల బదిలీలను వెబ్ కౌనె్సలింగ్‌లో చేపట్టాలని చెప్పిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు దీనికి అంగీకరించాయని, వారే ముందు కావాలని చెప్పి నేడు వద్దంటున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు. వెబ్ కౌనె్సలింగ్‌లో లోపాలు ఉన్నాయని, ఈ విధానం వద్దని గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప్రచారంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి స్పష్టత ఇచ్చారు. గత కొంతకాలంగా ఉపాధ్యాయ బదిలీలు లేక టీచర్లు ఇబ్బంది పడుతుండటంతో ముఖ్యమంత్రి సాధారణ బదిలీలకు అనుమతించారని, అయితే ఇవి పారదర్శకంగా జరిగేందుకు వెబ్ కౌనె్సలింగ్ చేపట్టాలని సూచించారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత రెండు సార్లు మే 21న, జూన్ 2న ఉపాధ్యాయ జేఏసీలతో సమావేశం నిర్వహించామని అన్నారు. ఈ సమావేశాల్లో వారంతా వెబ్ కౌనె్సలింగ్‌కు అంగీకరించారని, దీంతో పాటు పదోన్నతులు చేపట్టాలని కోరారని చెప్పారు. ఏకీకృత సర్వీసుల అంశం కోర్టులో ఉన్నందున, మేనేజిమెంట్‌ల వారీ పదోన్నతులకు కూడా వెబ్ కౌనె్సలింగ్ చేద్దామని చెప్పామని, దీంతో జీవో 16 తెచ్చామని వివరించారు. ఒకేసారి ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీల కౌనె్సలింగ్ నిర్వహిస్తే ఇబ్బందులు వస్తాయని, వేర్వేరుగా నిర్వహించమని కోరడంతో దానిని అంగీకరించామని ఈ మేరకు వేర్వేరుగా షెడ్యూలు ఇచ్చామని అన్నారు. జాబితాల రూపకల్పనలో పొరపాట్లు ఉన్నట్టు తమ దృష్టికి తీసుకువస్తే సరిదిద్దామని, కొంత మంది తప్పుడు పత్రాలు పెట్టారని తెలిస్తే వాటిని కూడా సరిదిద్ది జాబితాలు తయారుచేశామని అన్నారు. ఇంత దూరం వచ్చాక ఉపాధ్యాయ సంఘాలు వెబ్ కౌనె్సలింగ్ వద్దని చెప్పడం కోర్టుకు వెళ్లడం దారుణమని అన్నారు. కోర్టులో వాదనలు ఈ నెల 26వ తేదీకి రిజర్వు చేశారు. ఈ లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. 2193 మంది ప్రధానోపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే , 2181 మంది ఆప్షన్లు ఇచ్చారని చెప్పారు. కేవలం నలుగురు ప్రధానోపాధ్యాయులు తప్పనిసరి బదిలీ కావల్సిన జాబితాలో ఉండి, ఆప్షన్లు ఇచ్చుకోలేదని మిగిలిన వారందరూ సజావుగా చేసుకున్నారని అన్నారు. జూన్ 24వ తేదీ నుండి స్కూల్ అసిస్టెంట్ బదిలీల ప్రక్రియ ప్రారంభమైందని, ఇందులో 31,961 మంది దరఖాస్తు చేసుకుంటే 27,750 మంది కౌనె్సలింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. అయితే వెబ్ కౌనె్సలింగ్‌లో ఇచ్చిన ఆప్షన్లు మారుతున్నాయని, కొంత మంది యూనియన్ నేతలు ప్రచారం చేయడం వల్ల చాలా మంది గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. స్పెషల్ సిఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, కమిషనర్ అదర్ సిన్హా, విద్యాశాఖ సంక్షేమ అభివృద్ధి సంస్థ ఎండీ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి