తెలంగాణ

‘ఎరువు’ ఏడిపిస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: ఎరువుల ధరలు దరువేస్తున్నాయి. అన్నింటిపై 15శాతానికిపైగా ధరలు ఎగబాకాయి. ఇప్పటికే నానా తంటాలు పడుతూ సాగును నెట్టుకొస్తున్న అన్నదాతలకు ఎగబాకిన ఎరువుల ధరలు మరింత భారం కానున్నాయి. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు,నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు రైతులను బాధిస్తున్నా య. వాటికి తోడు పంటలకు చీడపీడలు, దోమపోటు వెరసి అరకొర పంట లు చేతికి రావడం పరిపాటిగా మారగా, ఆ చేతికందిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతన్న కుదేలవుతున్నాడు. ప్రభుత్వం అన్నదాతలకు చేయూతనందించాలనే లక్ష్యం తో ఈఖరీఫ్ సీజన్ నుంచి పెట్టుబడి సాయం అందించింది. దీంతో కొంత వెసలుబాటు దొరికిందనుకున్న సంతోషంలోనే ఎరువుల ధరల పెంపు ఆ సంతోషాన్ని ఆవిరిచేయగా పరిస్థితి మొదటి కొచ్చింది. సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో ఎరువుల ధరలను ఆయా కంపెనీలు పెంచడం ఆందోళన కలిగిస్తోంది. డీఏపీ ధర రూ.1,080 ఉండగా, రూ.1,250 కు ఎగబాకింది. రైతులు అధికంగా వినియోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరలు 15శాతానికిపైగా పెరిగాయి. ధరల పెంపుతో ఖరీఫ్ సాగుపై రైతులపై మళ్లీ అదనపు భారం తప్ప డం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టాదారు రైతులు, కౌలు రైతులు కలుపుకొని మొత్తం సుమారు ఆరు లక్షల మంది ఉండ గా, అందులో 60 నుంచి 70శాతం మంది రైతులు సాగు చేస్తుండగా, ప్రతి సీజన్‌లో 4 నుంచి 5లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో కూడా సుమారు 4లక్షలకుపైగా హెక్టార్లలో సాగుకు కర్షకులు సిద్ధమయ్యారు. అయి తే, ఇప్పటికే అప్పులు చేసి సాగు చేస్తూ కుదేలవుతున్న రైతాంగానికి తాజాగా పెరిగిన ఎరువుల ధరలు మరిం త ఇబ్బందిగా మారాయి.
ప్రతి సీజన్‌లో పెట్టుబడుల కోసం నానా అవస్థలు పడుతుండగా, ఈసారి ప్రభుత్వం రూ.4వేలు పెట్టుబడి సాయం అందించింది. అందించిన సాయం తో కొంతమేర వెసలుబాటు లభించిందనుకున్న సంతోషంలోనే ఎరువుల దరువుతో ఆ సంతోషం సన్నగిల్లగా, ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలని, పెట్టుబడి సాయం రూ.6వేలకు పెంచాలని రైతులు, రైతు సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.