తెలంగాణ

కేటీఆర్ చెంతకు కార్పొరేషన్ కహానీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జూన్ 25: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లో నెలకొన్న కహా నీ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెంతకు చేరింది. ఇక్కడ రాజకీయ పరిణామాల నేపథ్యమం తా కూడా ఆయన దృష్టికి వెళ్లింది. దీంతో రామగుండం కార్పొరేషన్‌లో అధికార పార్టీకి సంబంధించి తలెత్తుతున్న విభేదాలు ఒక్కసారిగా రాజధానిలో గుప్పుమన్నట్లు తెలుస్తోంది. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి ఇటీవల కాలంలో మంజూరైన 200 కోట్ల రూపాయల పనుల పురోగతిపైన సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూర్తి స్థాయిలో ఆరా తీశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక సమావేశం సందర్భంగా రామగుండం కార్పొరేషన్‌లో నెలకొన్న సమస్యలపై కాసేపు చర్చ జరగడం విశేషం. ఈ సందర్భంగా రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోసం మంజూరైన వందల కోట్ల రూపాయల నిధులు సక్రమం గా ఖర్చు చేయకుండా జరుగుతున్న జాప్యంపై ప్రిన్సిపల్ సెక్రటరీ కార్పొరేషన్ కమిషనర్‌ను నేరుగా మందలించినట్లు సమాచారం. ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు మంజూరైతే కనీసం 20శాతం పనులను కూడా పూర్తి దశకు చేరుకోక పోవడం పట్ల ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారిపై గరం అయిన్నట్లు తెలిసింది. అసలు రామగుండం కార్పొరేషన్‌లో అభివృద్ధికి సంబంధించి వచ్చిన వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది..? అసలు ఎవరి వైఫల్యం... అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేదా... ప్రజా ప్రతినిధుల వ్యవహారం సక్రమంగా లేదా... అన్ని తెలిసి అధికారులు ఎందుకు మిన్నకుండి పోతున్నారు అనే విషయాలను కూలంకషంగా ఆరాతీసి సీరియస్‌గానే మం దలించిన్నట్లు విశ్వనీయంగా తెలిసింది. రామగుండం కార్పొరేషన్‌లో మంజూరైన వందల కోట్ల రూపాయల పనుల పురోగతిని పెంచేందుకు స్వయంగా రామగుండంకు రెండు రోజుల్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాబోతున్నారు. ఇక్కడ పనుల జాప్యం వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరుగబోతుండటంతో అసలు ఎవరి మూలంగా ఈ జాప్యం జరిగిందో... రెండు రోజుల్లో తేటతెల్లం కాబోతోంది. ఇది లా ఉండగా రామగుండం కార్పొరేషన్ రాజకీయాలు కేటీఆర్ దృష్టికి చేరిన నేపథ్యంలో మేయర్ కొంకటి లక్ష్మీనారాయణను కూడా ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కాస్త మందలిస్తూ సీరియస్ అయిన్నట్లు చర్చ జరుగుతోంది.