తెలంగాణ

తహశీల్దార్‌పై రైతుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూన్ 26: నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము తహశీల్దార్ రవిశంకర్‌పై మంగళవారం నేరెడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన రైతులు పల్స రాములు, అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే పల్స రాములుకు సంబంధించిన వ్యవసాయ భూమి దాదాపు 3 దశాబ్దాల క్రితం చెరువు కోసం అధికారులు భూసేకరణ జరిపారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రైతు పల్స రాములుకు సంబంధించి గతంలో సేకరించిన భూమిని అధికారులు తొలగించారు.
దీంతో అప్పటి నుండి ఇప్పటి వరకు అధీనంలో ఉన్న భూమిని రికార్డుల నుండి ఎలా తొలగిస్తారు? అంటూ రైతు రాములు అతని కుటుంబ సభ్యులు తహశీల్దార్ రవిశంకర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయనపై దాడి చేసి కొట్టారు. దీంతో తహశీల్దార్ రవిశంకర్ తనపై దాడి చేసిన పల్స రాములు, పల్స పెంటయ్య, పల్స లక్ష్మమ్మలపై చర్యలు తీసుకోవాలని నేరెడుగొమ్ము పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు వినతి
నేరెడుగొమ్ము తహశీల్దార్ రవిశంకర్ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న సమయంలో తహశీల్దార్‌పై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని కోరుతూ దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఉద్యోగులు మంగళవారం ఆర్డీవో లింగ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు.