తెలంగాణ

ప్రతి నెలా 30న పౌరహక్కుల దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికై ప్రతీనెల 30న పౌరహక్కుల దినోత్సవాన్ని రాష్టవ్య్రాప్తంగా నిర్వహించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించేందుకు, హక్కులకు భంగం కల్పించే వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశాలు ఎంతగానో తోడ్పాడతాయని భావిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం ఆయా వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించి వారి అభివృద్ధికి దోహదపడేలా సమావేశాలు జరపాలని అధికార యంత్రాగానికి సూచనలు జారీ చేయనుంది. నెల వారి సమావేశాలతో పాటు మూడు నెలలకోసారి జిల్లా విజులెన్స్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసి) సమీక్షా సమావేశాలను సైతం విధిగా నిర్వహించేలా త్వరలో జిల్లా యంత్రాలకు మార్గదర్శకాలు జారీ చేయనుంది.