తెలంగాణ

టీ-హబ్ అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి-హబ్ ఎంతో అద్భుతమని అరబ్ ఎమిరేట్స్ విదేశాంగశాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ ప్రశంసించారు. ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో కలిసి శుక్రవారం షేక్ అబ్దుల్లా టి-హబ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టి-హబ్ విశేషాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే అతి పెద్ద ఇంక్యూబెటర్ టి-హబ్‌లో స్థాపించడం పట్ల ఆయన అభినందించారు. ఐటీ రంగంలో తమతో కలిసి పని చేయాలని మంత్రి కేటిఆర్ పిలుపునిచ్చారు.
ఐటీ సాంకేతికతను ఆరబ్ ఎమిరేట్స్, తెలంగాణ ప్రభుత్వం పంచుకోవాల్సిందిగా మంత్రి పిలుపునిచ్చారు. స్టార్టప్‌ల ఆలోచనలను పంచుకుందామన్నారు. తమ ప్రభుత్వం బ్లాక్‌చైన్ సొల్యూషన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అంతర్జాతీయ బ్లాక్‌చైన్ కాంగ్రెస్‌ను హైదరాబాద్‌లో ఆగస్టు మొదటి వారంలో నిర్వహించనున్నట్టు మంత్రి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలను మంత్రి వివరిస్తూ అరబ్ ఎమిరేట్స్ నుంచి పెట్టుబడులను ఆశిస్తున్నామన్నారు. తమ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక విధానం అత్యుత్తమైందన్నారు. అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన మూడు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ప్రతిపాదనలు పంపారని మంత్రి కెటిఆర్ వివరించారు.

చిత్రం..టీ-హబ్‌ను సందర్శించిన అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్‌కు
హబ్ గురించి వివరిస్తున్న మంత్రి కేటీఆర్