తెలంగాణ

మూడు నెలల్లో ముందస్తు ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హత్నూర, జూన్ 29: మూడు నెలల్లో ముందస్తు ఎన్నికలు రానున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌మార్‌రెడ్డి అన్నారు. శుక్రవారంనాడు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్‌లో నిర్వహించిన టీఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మానయ్య పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అన్నారు. ఉపాధ్యాయులు, సాధనోద్యమంలో ఉద్యోగ, ఉపాద్యాయులు ముందు వరుసలో ఉండి పని చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం చిన్న చూపుచూస్తోందని ఆరోపించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నాన్చుడుధోరణి అవలంబిస్తోందని అన్నారు. సీపీఎస్ పద్ధతిని రద్ధు చేసి పాత పద్ధతిలో పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు ఎలాంటి పోరాటాలకు దిగినా కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో టీఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మానయ్య సేవలు మరువలేనివని ప్రభుత్వం చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నా రు. మంగాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మానయ్య, లక్ష్మీలను శాలువాలుకప్పి సన్మానించారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మంచి గుర్తిం పు పొందిన ఘనత మానయ్యకే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..పదవీ విరమణ చేసిన మానయ్యను సన్మానిస్తున్న
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి